/rtv/media/media_files/8QCEUhL6SHJqpa1NPcak.jpg)
SBI 18 thousand jobs Notification soon
SBI JOBS: నిరుద్యోగులకు ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గుడ్ న్యూస్ చెప్పింది. 2025--26 ఫైనాన్షియల్ ఇయర్‌లో 18 వేల పోస్టులతో అతిపెద్ద రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Also Read: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!
3 వేల ఆఫీసర్లు..
ఈ మేరకు భర్తీ చేసే ఉద్యోగాల జాబితాను కేటగిరీల వారిగా విడుదల చేయగా.. ఇందులో 3 వేల ఆఫీసర్లను ప్రత్యేకంగా నియమించనుంది. ప్రొబేషనరీ ఆఫీసర్లు (PO), లోకల్ బ్యాంక్ ఆఫీసర్లు (LBO) పోస్టులు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్బీఐ టెక్నికల్ టీమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేసుకోవాలని భావిస్తున్న బ్యాంక్.. ఈ స్ట్రాటజీలో 1600 సిస్టమ్ ఆఫీసర్లను నియమించుకోనుంది. డిజిటల్, ఐటీ స్కిల్స్ టీమ్ ను కూడా సెట్ చేయనున్నట్లు ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టీ వెల్లడించారు.
Also Read: పాకిస్తాన్‌కి చుక్కలు చూపించిన సుదర్శన్ చక్రం.. భారత్‌కు శ్రీరామ రక్షలా రష్యా S-400
గడిచిన పదేళ్లలో ఇదే భారీ నోటిఫికేషన్. 13 వేల 500 నుంచి 14 వేల వరకు క్లరికల్ స్టాఫ్, 3 వేల మంది ప్రొబేషనరీ ఆఫీసర్లు, 16 వందల మంది సిస్టమ్ ఆఫీసర్లను రిక్రూట్ చేస్తాం. ఇది బ్యాంకిగ్ సెక్టార్ లోనే అతిపెద్ద రిక్రూట్ మెంట్. క్లరికల్ ఆప్టిట్యూడ్, డిజిటల్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారికి ఈ రిక్రూట్ మెంట్ గొప్ప అవకాశమని శెట్టి అన్నారు.
Also Read: పాక్ దాడులను తిప్పికొట్టాం.. కల్నల్ సోఫియా ఖురేషీ సంచలన వ్యాఖ్యలు
officers | telugu-news | today telugu news