/rtv/media/media_files/2025/03/13/Lpdj9HnTT9Ug98S0EFRs.jpg)
itbp released notification for recruitment of gd constable under sports quota
డిఫెన్స్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), గ్రూప్-సి పరిధిలోని నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 133 పోస్టుల (పురుషులు- 70,మహిళలు- 63) ను భర్తీ చేయనున్నారు.
Also read : ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
ఆసక్తి గల అభ్యర్థులు పదో తరగతి (మెట్రిక్యులేషన్) లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారంభం అయింది. ఏప్రిల్ 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు పురుష, మహిళా అభ్యర్థులు అర్హులు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. ఇవి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు.
Also read : ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..
విభాగాలు: వెయిట్‌లిఫ్టింగ్, టైక్వాండో, సైక్లింగ్, యోగాసన, పెన్కాక్ సిలాట్, బాస్కెట్‌బాల్ ఆర్చరి, ఫుడ్‌బాల్, గుర్రపు స్వారీ, కాయాకింగ్, అథ్లెటిక్, స్విమ్మింగ్, షూటింగ్, బాక్సింగ్, రోయింగ్, వాలీబాల్, జూడో, రెజ్లింగ్, జిమ్నాస్టిక్స్, కబడ్డి, ఐస్‌హాకీ, హాకీ, హ్యాండ్‌బాల్, ఐస్ స్కీయింగ్, పవర్ లిఫ్టింగ్, ఖోఖో ఉన్నాయి.
అర్హతలు: అభ్యర్థులు పదో తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో బహుమతి గెలుపొంది ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
Also Read : పెరుగన్నంతో పేగుల్లో పేరుకున్న బ్యాక్టీరియా పరార్
దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు. మిగతా అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విదానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక: 03.04.2025 నుంచి 02.04.2025 వరకు జరిగిన పారా-4(డి) క్రీడల్లో పథకాలు గెలిపొంది ఉండాలి. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంటేషన్, మెరిట్ మార్కుల ద్వారా సెలెక్ట్ చేస్తారు.
జీతం: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 చెల్లిస్తారు.
దరఖాస్తు ప్రారంభం: 04.03.2025.
దరఖాస్తుకు చివరి తేదీ: 02.04.2025.
WEB SITE