Bill Gates AI Comments: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై బిల్‌గేట్స్ షాకింగ్ కామెంట్స్

రాబోయే వందేళ్లలో ప్రోగ్రామర్లను ఏఐ భర్తీ చేయలేదని బిల్‌గేట్స్ అన్నారు. కోడింగ్‌కు కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ మాత్రమే అవసరమని ఓ ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. ప్రోగ్రామింగ్‌ రంగంలో AI మనకు అసిస్టెంట్‌గా మాత్రమే వ్యవహరిస్తుంది.

New Update
bill gates with Ai

Bill Gates AI Comments

Bill Gates AI Comments:

మైక్రోసాఫ్ట్(Microsoft) కో ఫౌండర్ బిల్‌గేట్స్(Bill Gates) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌(Artificial Intelligence)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని టెక్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. వారి అభిప్రాయలకు విరుద్ధంగా బిల్‌గేట్స్ ఓ ఇంటర్య్వూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే వందేళ్లలో ప్రోగ్రామర్లను ఏఐ భర్తీ చేయలేదని ఆయన అన్నారు. కోడింగ్‌కు కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ మాత్రమే అవసరమని అభిప్రాయపడ్డారు. 

బిల్‌గేట్స్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రోగ్రామింగ్‌ రంగంలో ఏఐ మనకు అసిస్టెంట్‌గా మాత్రమే వ్యవహరిస్తుంది. డీబగ్గింగ్‌ లాంటి బోరింగ్‌ అంశాల్లో సాయం చేస్తుంది. అంతేగానీ, పూర్తిగా ప్రత్యామ్నాయంగా మారదు. ప్రోగ్రామింగ్‌లో అత్యంత సవాల్‌తో కూడుకున్నది ఏంటంటే.. క్రిటికల్ ప్రాబ్లమ్స్ సృజనాత్మకంగా పరిష్కరించడం. దాన్ని మెషిన్స్‌ చేయలేవు. ప్రోగ్రామింగ్‌కు జడ్జిమెంట్‌, ఊహాత్మక ఆలోచనా ధోరణి, పరిస్థితులకు అనుకూలంగా సర్దుబాటు అవసరం. ఈ లక్షణాలు ఏఐలో ఉండవని బిల్‌గేట్స్‌ అన్నారు.

Also Read:హైదరాబాద్‌లో విషాదం... సైబర్ నేరగాళ్ల మోసానికి ఏపీ మహిళ ఆత్మహత్య

కోడింగ్‌ రాయడమంటే టైపింగ్‌ చేయడం కాదు.. చాలా లోతుగా ఆలోచించాల్సి ఉంటుందని బిల్‌గేట్స్ చెప్పారు. మానవ శక్తికి ఉండే సృజనాత్మకతకు ఏ అల్గారిథమ్‌ సరిపోదన్నారు. కోడింగ్‌, ఎనర్జీ మేనేజ్‌మెంట్‌, బయాలజీ రంగాలకు ఆటోమేషన్‌ ముప్పు తక్కువేనని ఆయన అంచనా వేశారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 8.5 కోట్ల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేసే అవకాశం ఉందని ఇటీవల వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ అంచనా వేసింది. అలాగే 9.7 కోట్ల మందికి ఉపాది లభించవచ్చని ఆశాభావం వ్యక్తంచేసింది. 

Also Read:చెడు కలలతో టార్చర్‌గా ఉందా..? ఈ పని చేయడం మానేస్తే చాలా..!!

Also Read: పాక్ గూఢచారి జ్యోతికి రాచమర్యాదలు...ఏకంగా ఆ రాష్ట్ర అతిథిగా....కేరళ శారీలో..

Advertisment
Advertisment
తాజా కథనాలు