పదో తరగతి విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది మార్చిలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ క్రమంలో సంక్రాంతి సెలవులను భారీగా తగ్గించారు. కేవలం మూడు రోజులు మాత్రమే పదోతరగతి విద్యార్థులకు సెలవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: Baby Bump: పెళ్లికి ముందే బేబీ బంప్ ఫొటోషూట్.. చైనాలో కొత్త ట్రెండ్ కేవలం మూడు రోజులు మాత్రమే.. జనవరి 13, 14, 15 తేదీల్లో సెలవులు ఇచ్చి మిగతా రోజుల్లో అదనపు తరగతులు నిర్వహించాలని ప్లాన్ విద్యాశాఖ ప్లాన్ చేస్తోంది. ఇదే కనుక జరిగితే పదవ తరగతి విద్యార్థులకు ఇక సంక్రాంతి సెలవులు మూడు రోజులు అన్నమాటే. ఇది కూడా చూడండి: YEAR ENDER 2024: దుమ్ములేపిన భారత ఆటగాళ్లు.. ఈ ఏడాది టాప్ 5 క్రీడా విజయాలివే! పదవ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఇటీవల విడుదల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. విద్యార్థులు మెరుగ్గా ప్రీపేర్ అయ్యేందుకు, ఒత్తిడిని తగ్గించేందుకు రోజు విడిచి రోజు ఉండేలా పరీక్షల షెడ్యూల్‌ను రూపొందిచారు. దీనివల్ల విద్యార్థులు పరీక్షల్లో ప్రతిభను కనబరచడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది కూడా చూడండి: Food Allergy: ఫుడ్ అలర్జీ డేంజర్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! ఇదిలా ఉండగా ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం, మార్చి 3 నుంచి 20వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు పరీక్షలకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రిపేర్ అయ్యేందుకు ఒక రోజు విడిచి మరో రోజు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇది కూడా చూడండి: GOOD NEWS: IAFలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. రూ.10.04 లక్షల ప్యాకేజ్!