GOOD NEWS: IAFలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. రూ.10.04 లక్షల ప్యాకేజ్!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ‘అగ్నివీర్ వాయు-2026’ నోటిషికేషన్‌ను విడుదల చేసింది. ఇంటర్‌ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా విద్యార్హత ఉన్నవారు అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 27 వరకు అప్లై చేసుకోవచ్చు.

New Update
Agniveer Vayu 2026 notification

Agniveer Vayu 2026 notification

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) తాజాగా ‘అగ్నివీర్ వాయు-2026’ నోటిషికేషన్‌ను విడుదల చేసింది. ఇంటర్‌ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా విద్యార్హత ఉన్నవారు అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అగ్నిపథ్ స్కీం కింద అగ్నివీర్ వాయు (01/ 2026) నియామకాలకు సంబంధించి నోటిషికేషన్ విడుదల చేసింది. ఇంటర్ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు
07.01.2005 నుంచి 01.07.2008 మధ్య జన్మించి ఉండాలి.

Also Read: ధమ్ బిర్యానీలో బ్లేడ్.. హాస్పిటల్ పాలైన కస్టమర్!  

జనవరి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

పురుషులతో పాటు మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు. పురుషులు 152 సెం.మీ ఉండాలి. మహిళలు 152 సెం.మీ ఉండాలి. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 22 నుంచి ఆన్‌లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. నవంబర్ 14న ఫలితాలు వెల్లడించనున్నారు. అనంతరం ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్టు ఆధారంగా ఎంపికచేయనున్నారు. ఇక ఈ అగ్నివీర్ వాయు జాబ్‌లకు సెలక్ట్ అయిన వారికి తొలి ఏడాది నెలకు రూ.30వేలు అందిస్తారు. రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.36వేలు, నాలుగో ఏడాది రూ.40వేలు చెల్లిస్తారు. ఇక 4ఏళ్ల తర్వాత బయటకు వచ్చేసిన వారికి ‘సేవానిధి ప్యాకేజీ’ కింద రూ.10.04 లక్షలు చెల్లిస్తారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు