ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. ఈ క్రమంలో రోజుకొక కొత్త ట్రెండ్ పుట్టుకొస్తోంది. ఏదైనా ఒక దేశంలో ట్రెండ్ మొదలైతే చాలు.. ఇక అన్ని దేశాల యువత కూడా అదే ట్రెండ్‌ను పాటిస్తారు. అయితే ఇటీవల చైనాలో ఓ సరికొత్త ట్రైండ్ మొదలైంది. ఆ ట్రెండ్ ఏంటో మీరు తెలిస్తే ఆశ్చర్యపడక మానరు. ఇది కూడా చూడండి: Food Allergy: ఫుడ్ అలర్జీ డేంజర్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! జీవితాంతం గుర్తుండాలని ముందుగానే.. తల్లి కావాలని ప్రతీ అమ్మాయి కోరుకుంటుంది. ఈ సమయంలో కొన్ని అపురూప క్షణాలన్ని కూడా జీవితాంతం గుర్తుండాలని అనుకుంటారు. 9 నెలల పాటు జరిగిన ప్రతీ విషయాన్ని కూడా గుర్తుగా ఉంచుకుంటారు. ప్రస్తుతం అయితే ఫొటోలు, వీడియోలు ద్వారా జ్ఞాపకాలను భద్రపరచుకుంటున్నారు. ఇది కూడా చూడండి: అల్లు అర్జున్ ఇష్యూ.. దిల్ రాజ్‌ని అడ్డంగా ఇరికించిన నిర్మాత నాగవంశీ అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఫొటోషూట్‌లు అనుకున్నంత బాగా రావనే ఉద్దేశంతో చైనా యువతులు పెళ్లికి ముందు బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రెగ్నెన్సీతో ఉన్న సమయంలో కొందరు లావుగా మారడం, ముఖంలో మార్పులు రావడం, మొటిమలు, సరైన శరీర ఆకృతి లేకపోవడం వల్ల ముందుగానే బేబీ బంప్‌తో ఫొటోషూట్ చేసుకుంటున్నారు. ఇది కూడా చూడండి: Junior NTR : ఒకే వేదికపై బాలయ్య, ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు పండగే గర్భం దాల్చినట్లు ఉన్న కాస్టూమ్‌లు ధరించి అందంగా ఫొటోలు వచ్చేలా తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని కొందరు యువతులు సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ బేబీ బంప్ ఫొటోషూట్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం చైనాలో ఉన్న చాలా మంది యువతులు ఈ ఫొటోషూట్‌ను చేయించుకుని గర్భవతి అనే ఫీల్‌ను ఆస్వాదిస్తున్నారట. ఇది కూడా చూడండి: GOOD NEWS: IAFలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. రూ.10.04 లక్షల ప్యాకేజ్!