New York: హాట్ హాట్ గా న్యూయార్క్ మేయర్ ఎన్నికలు.. ట్రంప్ కు సెగ పెడుతున్న జోహ్రాన్ మామ్దానీ

ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ హాట్ హాట్ గా ఉంది. రేపు జరగనున్న మేయర్ ఎన్నికలు ఇక్కడ హీట్ ను పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా భారత సంతతి వ్యక్తి జోహ్రాన్ మామ్దానీ మేయర్ గా పోటీ చేస్తుండడం..గెలిచే ఛాన్స్ లు ఎక్కువే ఉండడంతో ఆసక్తిగా ఉంది.

New Update
zohran

Zohran Mamdani

అమెరికా(america) లో ఇది ఎన్నికల వారం. సాధారణంగా అమెరికా అధ్యక్ష్య పదవికి పోటీ వున్న ఎన్నికలే ప్రపంచపు దృష్టిని ఆకర్షిస్తాయి. కానీ ఈ ఏడాది ఎన్నికలూ ప్రపంచం దృష్టిని కాకపోయినా అమెరికా మొత్తాన్నీ ఆకర్షిస్తున్నాయి. రేపు మంగళవారం జరగబోయే ఎన్నికల్లో న్యూయార్క్(new-york) నగర మేయర్ ఎవరనేది నిశ్చయమవుతుంది. అందరి కళ్ళూ ఈ ఎన్నికల వైపు చూడడానికి కారణం, ఈ ఎన్నికల్లో అభ్యర్థి జొహ్రన్ మమ్దాని! జొహ్రాన్ తల్లిదండ్రుల మూలాలు భారత్‌వి. తల్లి ఇండియాలోనే పుట్టి పెరిగిన అందరికీ తెలిసిన సినిమా డైరక్టర్, మీరా నాయర్. తండ్రి మహమూద్ మమ్దాని టెక్నికల్‌గా పుట్టింది బొంబాయిలోనే అయినా పెరిగింది, అనుబంధం ఏర్పరచుకుంది ఉగాండాలో. జొహ్రాన్ తండ్రి వైపు తాత-నానమ్మలు గుజరాతీ ముస్లిములు. తల్లి, తల్లి వైపు పూర్వీకులు పంజాబీ హిందువులు.

Also Read :  H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు శుభవార్త..ప్రాసెసింగ్ రీస్టార్ట్

ఎందుకు ఈ న్యూయార్క్ మేయర్ ఎన్నికలు అంత ముఖ్యం..

జొహ్రాన్.. తాను ఎన్నికయితే అద్దెలను తగ్గిస్తానని, పిల్లల సంరక్షణను, మెట్రో బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని సౌకర్యం కల్పిస్తానని, నగరంలో ప్రభుత్వమే నిర్వహించే కూరగాయల దుకాణాలని ఏర్పాటు చేస్తానని వాగ్ధానం చేశాడు. దాంతో పాటూ న్యూయార్క్ లోకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అడుగుపెడితే అరెస్ట్ చేయిస్తానని సంచలన వాగ్దానం చేశారు.  ఇజ్రాయెల్ వెలుపల అత్యధికంగా యూదులు నివసించేది న్యూయార్క్ లోనే.  పాలస్తీనాకు బహిరంగంగా మద్దతు ఇవ్వడమే కాక.. ఇజ్రాయెల్ పై తన కోపాన్ని కూడా ప్రదర్శించారు.  ఇలా ఓ వైపు సామాన్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ, అంతర్జాతీయ నీతి వైపు గొంతెత్తి మాట్లాడడం వల్లనే ఇతను ప్రస్తుతం అక్కడ మేయర్ ఎన్నికల్లో ఫేవరెట్ కంటెస్టెంట్ గా అయ్యారు. ముఖ్యంగా అక్కడి యువతరానికి బాగా నచ్చారు.  అతను ముస్లిం అనీ, జీహాదీ అని, అతను గెలిస్తే యూదులకు భధ్రత వుండదనీ ప్రత్యర్థులు ఎంతలా ప్రచారం చేసినా.. మత, జాతి తారతమ్యాలు లేకుండా యువత అతనికి మద్దతుగా పోటెత్తింది. అతనికి మద్దతుగా వేలమంది వాలంటీర్లు న్యూయార్క్ వీథుల్లో ప్రచారం చేశారు.

జోహ్రాన్ మామ్దానీ డెమొక్రాటిక్ పార్టీ తరపునే అభ్యర్థి అయినా ఆ పార్టీ నుంచే అతనికి మద్దతు లేదు.  ట్రంప్ దుందుడుకు, అప్రజాస్వామిక విధానాలను ఎదిరించడంలో అలసత్వం చూపిస్తున్నారని కోపంతో వున్నారు. వారు ట్రంపును నేరుగా డీకొనే నాయకుడిగా జొహ్రాన్ మమ్దానీని చూస్తున్నారు. న్యూ యార్క్ అమెరికాలో ఒక  నగరమే కావచ్చు.. కానీ దాని బడ్జెట్ చాలా చిన్న దేశాల బడ్జెట్ కంటే ఎక్కువ. దీని కారణంగా ఒక్కడి మేయర్ గా జోహ్రాన్ ఎన్నిక..  తర్వాత అతని పాలసీల విజయం అమెరికా భవిష్యత్తుకు బాట కావచ్చు. ఈ చిరు ఆశతో అమెరికా ఎంతో ఆశగా ఈ ఎన్నిక వైపు చూస్తోంది. 

Also Read: Team India: హమ్ హై టీమ్ ఇండియా.. విక్టరీ ఏంథమ్..సోషల్ మీడియాలో వైరల్..

Advertisment
తాజా కథనాలు