/rtv/media/media_files/2025/10/07/peace-talks-between-israel-and-hamas-2025-10-07-07-39-34.jpg)
Peace talks between Israel and Hamas
Gaza: గత కొంతకాలంగా బాంబుల వర్షంతో అట్టుడుకుతున్న గాజా యుద్ధం ముగింపు దశకు చేరుకుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. దానికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపడానికి ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక తొలి దశ అమల్లో భాగంగా సోమవారం హమాస్-ఇజ్రాయెల్ మధ్య పరోక్ష చర్చలు ఈజిప్టులో ప్రారంభమయ్యాయి. కాగా శాంతి చర్చలకు గాను హమాస్ బృందానికి ఖలీల్ అల్ హయ్యా నేతృత్వం వహిస్తుండగా, ఇజ్రాయెల్ బృందానికి నెతన్యాహు సన్నిహితుడు రాన్ డెర్మర్ నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది.
శాంతి చర్చల్లో భాగంగా తొలుత కాల్పుల విరమణ, , గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల పాక్షిక ఉపసంహరణ, బందీలు, పాలస్తీనా ఖైదీల విడుదల తదితర అంశాలపై ముందుగా చర్చించే అవకాశం ఉంది. ఈ చర్చలకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. కాగా ఈ శాంతి చర్చలు ఎర్ర సముద్ర తీరంలోని షర్మ్ ఎల్-షేక్ రిసార్టులో ప్రారంభమైనట్లు ఈజిప్టుకు చెందిన అధికారి ఒకరు స్పష్టం చేశారు. కాగా ఆయా దేశాల ప్రతినిథులతో పాటు అమెరికా పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ కూడా ఈ చర్చల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు పాలస్తీనియన్లకు సంఘీభావంగా పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ నాయకత్వంలో గాజా తీరానికి పడవల ద్వారా వచ్చి అరెస్టైన 171 మంది ఆందోళనకారులను ఇజ్రాయెల్ వదిలివేసింది. వారు తిరిగి వారు వారి స్వదేశాలకు చేరుకున్నారు.
కాగా యుద్ధ విరమణకు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికలోని కొన్ని అంశాలకు హమాస్ సానుకూలంగా స్పందించింది. దీంతో ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఈ విషయమై ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా హమాస్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంపై నెతన్యాహు నిరాశ వ్యక్తం చేయగా ‘‘నువ్వు ఎప్పుడూ ఎందుకింత దారుణమైన నెగెటివిటీని కలిగి ఉంటావో అర్థం కావడం లేదు. ఇదొక విజయం. దీన్ని స్వాగతించు’’ అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా హమాస్, అరబ్, ఇతర ముస్లిం దేశాలతో ఇజ్రాయెల్ చర్చలకు అంగీకరించడం సానుకూల అంశంగా ట్రంప్ అభివర్ణించారు. వీలైనంత త్వరగా చర్చలను ముగించి, ఈ వారంలోనే తొలి విడత శాంతి ఒప్పందాన్ని అమల్లోకి తేవాలని తాను కోరుకుంటున్నట్లు ట్రంప్ పేర్కొనడం గమనార్హం.
Also Read : ఈవారం ఓటీటీలో సందడే సందడి.. వార్2, మిరాయ్ సహా మొత్తం ఎన్నంటే?