Putin: పుతిన్‌ను అరెస్టు చేయడం సాధ్యమేనా ?..

యూరప్‌లోని హంగేరి దేశంలో ట్రంప్, పుతిన్ త్వరలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ న్యాయస్థానం (ICC) పుతిన్‌కు అరెస్టు వారెంట్ జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో పుతిన్ అరెస్టు అయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది.

New Update
Will Putin-Trump Meeting In Hungary Succee

Will Putin-Trump Meeting In Hungary Succee

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అలాస్కాలో సమావేశమైన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ మరోసారి భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి యూరప్‌లోని హంగేరి దేశంలో  ఇరు దేశాధినేతలు త్వరలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ న్యాయస్థానం (ICC) పుతిన్‌కు అరెస్టు వారెంట్ జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో పుతిన్ అరెస్టు అయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది.   

పుతిన్‌ను అరెస్టు చేయొచ్చా ?

ICCకి ప్రత్యేకంగా పోలీసు దళం అనేది లేదు. దీంతో సొంతంగా అరెస్టు చేయడం అనేది అసాధ్యం. అయితే ఎవరిపైనా అరెస్టు వారెంట్‌ను అమలు చేసేందుకు దాని సభ్య దేశాలపై ఆధారపడి ఉంటుంది. దీని ప్రకారం చూసుకుంటే రష్యా అధ్యక్షుడి విమానం తమ గగనతలంలోకి రాగానే హంగేరీ, దాని పొరుగు దేశాలైన సెర్బియా, రొమేనియా పుతిన్‌ను అరెస్టు చేసేందుకు అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి హంగేరికి కూడా జర్మనీ నుంచి రిక్వెస్ట్‌ వచ్చింది. ICCలో హంగేరీ సభ్యదేశంగా ఉంది. కానీ ఆ సభ్యత్వాన్ని వదులుకోవాలని ఆ దేశ ప్రధాని విక్టర్ ఒర్బన్ నిర్ణయించారు. 

Also Read: ఇది ట్రైలరే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్‌ సింగ్‌ స్ట్రాంగ్ వార్నింగ్

ఏప్రిల్‌లో దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైంది. అయినప్పటికీ కూడా అరెస్టు చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. అయితే ట్రంప్‌కు ఒర్బన్‌ మిత్రుడిగా ఉన్నారు. అలాగే రష్యాతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే హంగేరీ పుతిన్‌ రక్షణకు హామీ ఇస్తోందని తెలుస్తోంది. 
అంతేకాదు ఈ ఏడాది ఏప్రిల్‌లో హంగేరీలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పర్యటనను కూడా ఒర్బన్ గుర్తుచేశారు. నెతన్యాహుపై కూడా అరెస్టు వారెంట్ జారీ అయినప్పటికీ హంగేరీ దీన్ని పట్టించుకోలేదు. 

ఇక హంగేరీలో గత 15 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న ఒర్బన్‌పై అక్కడి ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది. దీంతో ట్రంప్, పుతిన్ భేటీని ఆయన కీలకంగా తీసుకున్నారు. వాళ్లిద్దరూ భేటీ అయ్యేందుకు హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌ కంటే అనువైన ప్రదేశం లేదని అనుకుంటున్నారు. మరోవైపు పుతిన్ పర్యటనపై ఐరోపా దేశాల్లో అనిశ్చితి నెలకొంది. ఉక్రెయిన్‌కు సపోర్ట్ చేస్తున్న ఈ దేశాలు రష్యాను ఒంటరి చేసేందుకు ఎప్పటినుంచో ఆంక్షలు పెడుతూ వస్తున్నాయి. 

Also Read: విమానం గాల్లో ఉండగా మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు.. VIDEO

అరెస్టు కష్టమే 

ఇప్పటికే యూరప్‌ గగనతలంలో రష్యా విమానాలు ఎగరడంపై, అలాగే వాటి భూభాగంలో ల్యాండ్ అవ్వడంపై నిషేధం అమల్లో ఉంది. హంగేరీ కూడా ఆ దేశాల్లో భాగమే. ఒకవేళ యూరప్‌ దేశాలు రష్యాపై ఆంక్షలు కొనసాగించాలని భావిస్తే ఉక్రెయిన్‌లో శాంతి ఒప్పందంపై ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే పుతిన్ అరెస్టు కోసం ఆ దేశాలు పట్టుపడకుండా ఆయన బుడాపెస్ట్‌కు చేరుకునేలా మినహాయింపు ఇవ్వాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలాఉండగా పుతిన్‌పై 2023లో అంతర్జాతీయ న్యాయస్థానం (ICC) అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లో చిన్నారులను రష్యా కిడ్నాప్ చేసిందన్న ఆరోపణలపై ఈ అరెస్టు వారెంట్ ఆయనపై జారీ అయినట్లు సమాచారం. 

Advertisment
తాజా కథనాలు