/rtv/media/media_files/2025/03/26/LUzbkObccWZqFQrOuR4S.jpg)
south korea
సౌత్ కొరియాలో దట్టమైన కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. ఈ మంటలను ఆర్పేందుకు స్థానిక అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 19 మంది మృతి చెందారు. అంతేకాక ..శతాబ్ధాల నాటి బౌద్ధ దేవాలయం కూడా ధ్వంసమైంది. ఇంటీరియర్ సేఫ్టీ మినిస్ట్రీ ప్రస్తుత పరిస్థితి పై ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది.
Also Read: Sonu Nigam:ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ పై రాళ్లు, సీసాలతో దాడి..!
దాని ప్రకారం..పొడి గాలులు కారణంగా మంటు వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా వాటిని అదుపు చేయడంలో అధికారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దాదాపు 19 మంది మృతి చెందగా.. మరో 19 మంది గాయపడ్డారు. ఇక మంటలను ఆర్పేందుకు వెళ్లిన హెలికాఫ్టర్ కూలిపోగా..అందులోని ఫైలెట్ మృతి చెందారు. ఉయిసాంగ్ కౌంటీలో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి.
Also Read: America:యూఎస్ హెల్త్ ఏజెన్సీకి అధిపతిగా భారత సంతతి వ్యక్తి నియామకం!
Wild Fire In South Korea
దీంతో 1300 సంవత్సరాల నాటి పురాతన గౌన్సా దేవాలయం కాలిపోయింది. అయితే ఆలయంలోని కళాఖండాలతో సహా పలు విగ్రహాలను ముందే ఇతర దేవాలయాలకు తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ కార్చిచ్చును ఆర్పేందుకు 10 వేల మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, పౌర సేవకులు శ్రమిస్తున్నారు.
కార్చిచ్చు వల్ల బుధవారం నాటికి 43 వేల ఎకరాలు కాలి బూడిదయ్యాయని అధికారులు వెల్లడించారు. స్థానిక నివాసితులకు ఖాళీ చేయమని ఇప్పటికే ఆదేశించినట్లు వెల్లడించారు. 68 శాతం మంటలు అదుపులోకి వచ్చాయన్నారు. ఉత్తర,దక్షిణ జియోంగ్‌సాంగ్, ఉల్సాన్ నగరంలోని అనేక ప్రాంతాల్లో మాత్రం మంటలు చురుకుగా వ్యాపిస్తున్నాయి.
ఈ కార్చిచ్చు పై దక్షిణ కొరియా ప్రధాన మంత్రి, తాత్కాలిక అధ్యక్షుడు హన్ డక్- సూ స్పందించారు. ఇది అత్యంత ఘోరమైంది. ఈ మంటల కారణంగా అపూర్వమైన నష్టం ఏర్పడింది. దీనికి మేము ఎంతో ఆందోళన చెందుతున్నాం.మంటలను అదుపు చేయడం పై ప్రత్యేక దృష్టిసారించాం. ఇవి పొరుగు ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు ప్రజలు అధికారులకు సహకరించాలని కోరుతున్నా అని ఆయన పేర్కొన్నారు.
Also Read: Bangladesh: బంగ్లాదేశ్ లో మీడియాకి వదంతుల పండగ..యూనస్ సంచలన వ్యాఖ్యలు
south-korea | wildfire | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | today-news-in-telugu | international news in telugu