/rtv/media/media_files/2025/03/26/enE0OEp9J9LD51Fea94T.jpg)
sonu
ఇండియన్ సినీపరిశ్రమలోని ప్రసిద్ధ గాయకులలో సోనూ నిగమ్ ఒకరు. హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించి శ్రోతలని ఆకట్టుకున్నారు. పాటలతో మంచి పేరు తెచ్చుకున్న సోనూ నిగమ్ పలు వివాదాలతో వార్తలలో నిలుస్తుంటారు. ఆ మధ్య అర్జిత్ సింగ్ కు పద్మ శ్రీ అవార్డ్ రావడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి విమర్శల పాలయ్యాడు. సోనూ నిగమ్ ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ పాటలను ఆలపించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అతనికి సొంతంగా బ్యాండ్ కూడా ఉంది. సోనూ నిగమ్ హిందీలోనే కాకుండా తమిళం, తెలుగు, కన్నడలోనూ అనేక పాటలు పాడిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా అతనిపై దాడి జరిగింది.ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ లో జరిగిన ఇంజిఫెస్ట్ 2025 కార్యక్రమంలో పాడేందుకు వచ్చిన సోను నిగమ్ పై అనేక మంది విద్యార్థులు రాళ్ళు, సీసాలను విసిరి దాడి చేశారు. లైవ్ షో సమయంలో వారు అలా చేయడంతో సోనూ నిగమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు గౌరవంగా ప్రవర్తించాలని , మీతో మంచి సమయం గడిపేందుకు నేను మీ కోసం ఇక్కడికి వచ్చినట్లు సోను అన్నారు. అయితే వారు చేసిన దాడితో సోనూ జట్టు సభ్యుల్లో కొందరు గాయపడ్డట్టు తెలుస్తుంది.
Also Read: Modi-Trump: టారిఫ్‌లు తగ్గించేందుకు మోదీ సర్కార్ చర్యలు..ట్రంప్ ఎఫెక్టేనా!
లైవ్ షో జరుగుతుండగా.. సమూహంలోని కొందరు రాళ్లు, ప్లాస్టిక్ బాటిళ్లను వేదిక వైపు విసిరేయడంతో షోను మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. ఈ కార్యక్రమానికి లక్ష మందికి పైగా హాజరయ్యారు. ఈ కారణంగా జనసమూహాన్ని నిర్వహించడం చాలా కష్టమైందని అర్ధమవుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా సోను విషయంలో ఇలాంటి సంఘటనే జరిగింది. ఆయన కోల్‌కతాలో ప్రదర్శన ఇస్తున్న క్రమంలో ప్రేక్షకులు అక్కడి వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే జనసమూహాన్ని నియంత్రించడానికి సోను నిగమ్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆయన పాట పాడుతున్నప్పుడు అక్కడ ఉన్న కొంతమంది లేచి నిలబడడంతో వెనక్కి వెళ్లాలని ఆయన కోపంగా అన్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read: Sajjanar: ఉన్నది ఒక్కటే జీవితం అంటూ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్
Also Read: America:యూఎస్ హెల్త్ ఏజెన్సీకి అధిపతిగా భారత సంతతి వ్యక్తి నియామకం!
sonu nigam | atatck | singer | college | festival | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates
Follow Us