Digital Frauds: డిజిటల్ మోసాలు...లక్షల సిమ్‌ కార్డులు,వేల వాట్సాప్‌ ఖాతాలు బ్లాక్‌ చేసిన కేంద్రం!

డిజిటల్‌ మోసాలపై చర్యలు తీసుకున్నామని..ఇప్పటి వరకు 7.81 లక్షల సిమ్‌ కార్డులను డీయాక్టివేట్‌ చేసినట్లు బండి సంజయ్ కుమార్‌ అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 7.81 లక్షల సిమ్‌ కార్డులు ,83 వేల వాట్సాప్‌ ఖాతాలను నిలిపివేసినట్లు తెలిపారు.

New Update
mobiles

mobiles

డిజిటల్‌ అరెస్ట్‌ పేరిట సైబర్ కేటుగాళ్లు నేరాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.ప్రజలను తప్పుదోవ పట్టించి కాజేస్తున్న వారి ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్‌ లోక్‌సభలో తెలిపారు.డిజిటల్‌ మోసాలపై చర్యలు తీసుకున్నామని..ఇప్పటి వరకు 7.81 లక్షల సిమ్‌ కార్డులను డీయాక్టివేట్‌ చేసినట్లు వెల్లడించారు.

Also Read: PF Withdraw -Atm: ఇక ఏటీఎం నుంచి పీఎఫ్‌ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?

లోక్‌ సభలో ఈ ప్రశ్నకు బండి సమాధానమిసత్ఊ నకిలీ పత్రాల ద్వారా సిమ్‌ కార్డులు పొంది డిజిటల్‌ మోసాలకు పాల్పడే వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు మోడీ సర్కార్‌ కృషి చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 7.81 లక్షల సిమ్‌ కార్డులు ,83 వేల వాట్సాప్‌ ఖాతాలను నిలిపివేశాం.

Also Read: AP NEWS: షాకింగ్ న్యూస్.. ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ బంద్.. ఎందుకంటే?

మొత్తం 2,08,469 ఐఎమ్‌ఈఐలను భారత ప్రభుత్వం ఆపేసిందని సభకు తెలిపారు.ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ అనేది ప్రతి ఫోన్‌ కు కేటాయించే ఒక స్పెషల్‌ సంఖ్య. ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో ఆర్డినేషన్‌ సెంటర్‌ .. 3,962 కి పైగా డిజిటల్ అరెస్ట్‌ కోసం వినియోగించే  స్కైప్‌ ఐడీలు, 83,668 వాట్సాప్‌ ఖాతాలను ముందుగానే గుర్తించి బ్లాక్‌ చేసింది.

ఐ4సీ నేతృత్వంలో సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ 2021 లో ఏర్పాటైంది.ఇప్పటి వరకు 13.36 లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయి. దీని వల్ల దాదాపు రూ.4,386 కోట్లు కాపాడాం అని బండి సంజయ్‌ తెలిపారు. మహిళలు,చిన్నారులే లక్ష్యంగా జరిగే నేరాల పై దృష్టి సారించామన్నారు. అన్ని రకాల డిజిటల్‌ నేరాలకు సంబంధించి ప్రజలు ఫిర్యాదు చేసేందుకు సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ పోర్టల్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారని...వీటి పై సంబంధిత రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లోని అధికారులు చర్యలు చేపడతారని వివరించారు.

Also Read: Banking New Rules: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి 7 కొత్త రూల్స్.. లిస్ట్ ఇదే!

Also Read: Donald Trump: భారతీయ గ్రీన్ కార్డుదారులకు ఇక చుక్కలు చూపించనున్న ట్రంప్ కొత్త పాలసీ విధానం!

digital fraud | sim-cards | block | whatsapp | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు