Bangladesh: బంగ్లాదేశ్‌ లో మీడియాకి వదంతుల పండగ..యూనస్‌ సంచలన వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరగబోతున్నట్లు పలు మీడియాల్లో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.వీటిని ఇప్పటికే ఆ దేశ సైన్యం ఖండించింది.

New Update
Bangladesh:

yunas

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరగబోతున్నట్లు పలు మీడియాల్లో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.వీటిని ఇప్పటికే ఆ దేశ సైన్యం ఖండించింది. తాజాగా యూనస్ సైతం దీని పై స్పందించారు. బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీడియాలో వందతుల పండగ జరుగుతున్నట్లు ఆయన విమర్శించారు.

Also Read: Sajjanar: ఉన్నది ఒక్కటే జీవితం అంటూ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇలాంటి తప్పుడు వార్తలు ఇంకా పెరుగుతాయన్నారు. బంగ్లాలో 53వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యూనస్‌ ఓ టెలివిజన్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యలో మాట్లాడారు. గతేడాది జులై-ఆగస్టుల్లో తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఓడిపోయిన వారు ఈ వదంతులను సాధనాలుగా మార్చుకుంటున్నారు.ఈ తప్పుడు కథనాల వెనుక ఎవరు ఉన్నారు,ఎవరు వీటిని నడిపిస్తున్నారనేది మీ అందరికీ తెలుసు. 

Also Read: Digital Frauds: డిజిటల్ మోసాలు...లక్షల సిమ్‌ కార్డులు,వేల వాట్సాప్‌ ఖాతాలు బ్లాక్‌ చేసిన కేంద్రం!

Rumors Fest About Yunus Government

వీటిని వ్యాప్తి చేసేందుకు విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తూ 24 గంటలూ ఇదే పని మీద ఉన్నారు.మనందరి ఐక్యత వారిని కల్లోలానికి గురి చేస్తుంది. దీన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు. వారి వినూత్నమైన ఆటలకు ఎప్పుడు పావుగా మారతారో మీకే తెలీదు.మనం యుద్ధ పరిస్థితుల్లో ఉన్నామని గుర్తుంచుకోండి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి వదంతులు మరింత పెరిగిపోతయాయి.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నా అని యూనస్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గుటెర్రస్‌ దీని పై తమకు హామీ ఇచ్చారన్నారు. రిజర్వేషన్ల వ్యతిరేక నిరసనల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో గతేడాది ఆగస్టులో హసీనా దేశం విడిచిపారిపోయిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి భారత్‌ లో ఆమె తలదాచుకుంటున్నారు. అనంతరం యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.తాజాగా ఆయనకు వ్యతిరేకంగా దేశంలో తిరుగుబాబు చెలరేగే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి.దీంతో అక్కడి ఆర్మీ అధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారనేది వాటిల్లోని సారాంశం. అయితే వీటిని బంగ్లా సైన్యం ఖండించింది. ఆ కథనాలు వార్త పాత్రికేయ దుష్ప్రవర్తనకు నిదర్శనమని బంగ్లాదేశ్‌ సైనిక ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read:PF Withdraw -Atm: ఇక ఏటీఎం నుంచి పీఎఫ్‌ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?

Also Read: AP NEWS: షాకింగ్ న్యూస్.. ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ బంద్.. ఎందుకంటే?

 

bangladesh | haseena | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | today-news-in-telugu | international news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు