Nepal: నేపాల్ తర్వాతి ప్రధాని ఎవరు? జెన్ Z ఓటు ఆ ఇద్దరిలో ఎవరికి?

నేపాల్ రాజకీయాలు ప్రస్తుతం సంక్షోభంలో పడ్డాయి. నేపాల్‌ ప్రభుత్వం కూలిపోవడంతో అక్కడి ఆర్మీ శాంతి భద్రతలను అదుపులోకి తీసుకుంది. కొంత సద్దుమణిగాక నేపాల్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి ప్రధాని ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.

New Update
nepal

Who Is Nepal Next PM?

నేపాల్(Nepal) లో ప్రస్తుత పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. అక్కడి ప్రభుత్వం పడిపోయింది. ఆర్మీ చేతుల్లోకి అంతా వెళ్లిపోయింది. జెన్ జీ యువత చేసిన ఆందోళన ఇప్పటి దాకా 22  మంది మరణానికి కారణమైంది. దాంతో పాటూ వారు అక్కడ పలువురు మంత్రులు, సుప్రీంకోర్టు, మీడియా కార్యాలయాలకు నిప్పంటించారు. ఈ గొడవల్లో 300 మందికి పైగా గాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్న జైల్లోకి కూడా నిరసనాకారులు దూసుకెళ్లారు. అక్కడ బందీగా ఉన్న 900 మంది ఖైదీలను విడుదల చేశారు. చివరికి ప్రధాని కేపీ శర్మ ఓలీ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. 

ఈ నేపథ్యంలో నేపాల్ తదుపరి ప్రధాని ఎవరు అన్న విషయంపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం దేశాన్ని సైన్యం నడుపుతోంది. తక్షణం శాంతిని నెలకొల్పడం సైన్యం  మొదటి లక్ష్యం కాగా.. కొంత సద్దుమణిగాక అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ  క్రమంలో తదుపరి ప్రధాని ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ రేసులో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు నేపాల్ ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన రబీ లచ్చిమనే, ​​మరొకరు రాజధాని ఖాట్మండు మేయర్ బాలెన్ షా. వీరిద్దరూ నేపాల్ జెన్ జీ యువతకు ప్రియమైన నేతలు. వీరి రాజకీయ చరిత్ర కూడా అసాధారణంగా ఉందని..ప్రజల్లో మంచి పేరొందని చెబుతున్నారు. 

Also Read :  తాను తీసిన గోతిలో తానే..అమెరికా కంపెనీలపై ట్రంప్ సుంకాల దెబ్బ

మేయర్ బాలెన్ షా..

ఖాట్మండు మెట్రోపాలిటన్ కు ప్రస్తుతం ఇతను మేయర్ గా ఉన్నారు. బాలెన్ షా ఇంజనీర్ చదివారు. దాంతో పాటూ ఇను రాపర్ కూడా. అందుకే అక్కడి యువతలో ఇతని పట్ల మంచి క్రేజ్ ఉంది. బాలెన్ హిమాలయన్ వైట్‌హౌస్ ఇంటర్నేషనల్ కాలేజీ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ,   VTU నుండి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. మరోవైపు ఈ యువ నేత పలు మ్యూజిక్ ఆల్బమ్స్ ను కూడా విడుదల చేశారు. 2012లో బాలెన్ షా చేసిన సడక్ బాలక్ మంచి హిట్ కొట్టింది. 2013లో యూట్యూబ్ ఆధారిత రా బార్జ్ రాప్ బాటిల్ సిరీస్ ద్వారా నెఫ్‌హాప్ అనే హిప్ హాప్ శైలిలో తనదైన ముద్ర వేశారు. ఇవన్నీ ఒకఎత్తైతే... బాలెన్ రాజకీయ జీవితం మరో ఎత్తు. 022లో ఖాట్మండు మేయర్ ఎన్నికల్లో ఏ సాంప్రదాయ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. మేయర్‌గా, వ్యర్థాల నిర్వహణ, అక్రమ నిర్మాణాల నిర్మూలన, ఫుట్‌పాత్ మెరుగుదలలు, ప్రభుత్వ పాఠశాలల నాణ్యతపై దృష్టి పెట్ట అభివృద్ధి సాధించారు.  ప్రజల్లో ప్రభుత్వ పారదర్శకతను పెంచడానికి గవర్నమెంట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేశారు.ప్లాస్టిక్ సంచులను నిషేధించారు, డిజిటల్ బిల్డింగ్ పర్మిట్ వ్యవస్థను అమలు చేశారు. ఈ కారణంగా బాలెన్ షా..TIME మ్యాగజైన్ 2023లో నెక్స్ట్ ఎమర్జింగ్ లీడర్స్ - TIME100 నెక్స్ట్ జాబితాలో చోటు సంపాదించారు. అందుకే ఈయన అంటే అక్కడ యువతకు చాలా ఇష్టం అని చెబుతున్నారు. 

రబీ లామిచానే..

రబీ లామిచానే బ్యాగ్రౌండ్ జర్నలిజం. అక్కడి నుండి జాతీయ రాజకీయాలకు(telugu national politics) వచ్చారు. సిద్ధ కుర జనతా సంగ్ అనే టీవీ షో ద్వారా అవినీతి, సామాజిక అన్యాయాన్ని బహిర్గతం చేయడం ద్వారా ఇతను ప్రజలలో అపారమైన ప్రజాదరణ పొందారు. దాన్ని తరువాత రాజకీయాల్లో ఉపయోగించుకున్నారు రబీ. సొంతంగా  రాష్ట్రీయ స్వతంత్ర పార్టీని స్థాపించి, హోం మంత్రి , ఉప ప్రధాన మంత్రిగా ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు.  అయితే నవంబర్ 2023లో నేపాల్ సుప్రీంకోర్టు ఆయనను పౌరసత్వ చట్టాలను ఉల్లంఘించినందుకు ఈ పదవుల నుండి తొలగించింది. దీనికి కారణం రబీ నేపాల్ రాజకీయాల్లో ఉంటూ అమెరికా పౌరసత్వాన్ని వదకలపోవడమే కాకుండా..నేపాల్ పౌరసత్వాన్ని కూడా  తిరిగి పొందలేదు. దాంతో పాటూ సుప్రీం కోఆపరేటివ్ స్కామ్‌లో లక్షలాది నేపాలీ రూపాయలను దుర్వినియోగం చేసినందుకు ఆయన అరెస్టు అయ్యారు. అయినప్పటికీ యువతలో రబీకి ప్రజాదరణ ఫుల్ ఉంది. ఉపాధి కల్పన, ఆరోగ్య సదుపాయం, పరిపాలనా పారదర్శకత లాంటి అనేక సామాజిక సమస్యలపై రబీ లామిచానే పోరాటం చేశారు. 

Also Read :  మళ్ళీ భారీగా పెరిగిన బంగారం.. ఒక్క రోజులోనే రూ. 5 వేలకు పైగా..

Advertisment
తాజా కథనాలు