US-China: తాను తీసిన గోతిలో తానే..అమెరికా కంపెనీలపై ట్రంప్ సుంకాల దెబ్బ

అమెరికా ఆదాయాన్ని పెంచాలని.. ఆర్థిక అగ్రరాజ్యంగా తీర్చిదిద్దాలని అధ్యక్షుడు ట్రంప్ కలలు కన్నారు. సుంకాలను విధించారు. కానీ ఇప్పుడు ఆ దెబ్బ అమెరికా కంపెనీలకు తగులుతోంది. చైనా 10 శాతం ప్రతీకార సుంకాల దెబ్బకు కంపెనీల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది.

New Update
us-china

అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) దాదాపు అన్ని దేశాలపై టారిఫ్(Trump Tariffs) ల కొరడా ఝళిపించారు. భారత్, చైనా దేశాలపై అయితే 50 శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు. దాని ద్వారా యూఎస్ ఖజానా నింపుదామనుకున్నారు. కానీ ఇప్పుడు అది రివర్స్ అయింది. ట్రంప్ సుంకాలు సొంత దేశ కంపెనీలకే దెబ్బేస్తున్నాయి. దీనికి కారణం అమెరికాలో చాలా కంపెనీలు చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుండడమే అని చెబుతున్నారు. ఈ విషయం మర్చిపోయిన ట్రంప్ బీజింగ్ పై అత్యధిక సుంకాలు విధించారు. అందుకు ప్రతిగా అది కూడా ప్రతీకార సుంకాలు విధించింది. దీంతో అమెరికా కంపెనీలే ఎక్కువగా నష్టపోతున్నాయని షాంఘైలోని అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ నిర్వహించిన సర్వేలో తేలింది.   

Also Read :  నేపాల్ మంత్రిని పరిగెత్తించి కొట్టిన జనాలు.. వీడియో వైరల్!

కెమికల్ కంపెనీలపై భారం..

మొత్తం 254 లో మూడో వంతు కంపెనీలపై అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సర్వే నిర్వహించింది. వీటిల్లో దాదాపు అన్నీ చైనా విధించిన కొత్త టారిఫ్ ల వల్ల తమ ఆదాయం తగ్గుతోందని చెప్పాయి. దాంతో పాటూ బ్యాంకింగ్‌, కొన్నిరకాల ఇతర పరిశ్రమలు అమెరికాకు ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు చేయడం లేదు. వీటిపై టారిఫ్ భారం ఉండదు. అయినా కూడా మిగతా కంపెనీలపై పడుతున్న భారతం అమెరికాకు నష్టాన్నే మిగులుస్తున్నాయి. ప్రస్తుతం చైనా 10 శాతం సుంకాలను మాత్రమే విధిస్తోంది. అలా కాకుండా మొదట్లో రెండు దేశాలను కొట్టుకుని టారిఫ్ లను 145 శాతం వరకూ తీసుకెళ్లాయి. అదే కనుక కొనసాగి ఉండి ఉంటే మొత్తం అన్ని కంపెనీ మూటా ముల్లె సర్ధుకుని..తాళాలు వేసి వెళ్ళిపోయేవి. 

అయితే ఇప్పుడు చైనా విధిస్తున్న 10 శాతం సుంకాలు చైనా నుంచి అమెరికాకు ఎగుమతులు చేసే కంపెనీలు, అలాగే అక్కడి నుంచి  కొన్ని రకాల ముడిసరకు దిగుమతి చేసుకొనే కంపెనీలపై పడింది. వీటిల్లో ముఖ్యమైనవి కెమికల్ కంపెనీలు. వీటిపై టారిఫ్ ల ప్రభావం చాలా ఎక్కువ పడింది. దాదాపు మే నుంచి చైనా, అమెరికాల మధ్య టారిఫ్ లపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అవి ఇప్పటి వరకు ఒక కొలిక్కి మాత్రం రాలేదు. ఈ లోపు కంపెనీలు మాత్రం నలిగిపోతున్నాయి. దీంతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన కంపెనీలకు ఈ అనిశ్చితి ఒక సవాలుగా మారిందని షాంఘై ఛాంబర్ లీడర్ జెంగ్ చెబుతున్నారు.  

ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు మాత్రం ఇంకోలా ప్రవర్తిస్తున్నారు. తమ దేశం టారిఫ్ ల విషయంలో భారత్, చైనాలతో చర్చలు జరుపుతుంది అని చెబుతున్నారు. వాటిని తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ పక్క నుంచి యూరోపియన్ యూనియన్ ను మాత్రం ఎగదోస్తున్నారు. రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు చైనా, భారత్ లతో 100 శాతం సుంకాలను విధించండి అంటూ యూరోయిన్ యూనియన్ నేతలకు ఆర్డర్లు వేస్తున్నారు. ఆ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని ఆపేస్తామని చెప్పేవరకు ఈ సుంకాలు కొనసాగించాలని కోరారు.

Also Read: ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన మోదీ..ఇండియా, అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్ అని కామెంట్

Advertisment
తాజా కథనాలు