Gold And Sliver Rates: మళ్ళీ భారీగా పెరిగిన బంగారం.. ఒక్క రోజులోనే రూ. 5 వేలకు పైగా..

బంగారం ధర ఎక్కడా తగ్గేదే ల్యా అంటోంది. రోజు రోజుకూ పెరుగుతూ కొండెక్కి కూర్చొంటోంది. ఒక్క రోజులోనే రూ. 5 వేలకు పైగా పెరిగింది. దీంతో 10 గ్రాములకు పసిడి ధర రూ. 1,12,750కు చేరి కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది.

New Update
gold jewelry

gold jewelry

బంగారం ధరకు పట్టపగ్గాలు లేకుండా పోతోంది. రోజూ ఎంతో కొంత పెరుగుతూనే ఉంది. ఈరోజు అయితే ఏకంగా రూ. 5వేలు పెరిగి కొండెక్కి కూర్చొంది. అంతర్జాతీయంగా కేంద్రీయ బ్యాంకులతో పాటు మదుపర్లు పసిడిపై పెట్టుబడులు పెడుతుండడమే ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో అంతర్జాతీయంగా బంగారం ధర బాగా పెరిగింది. ఔన్సు పసిడి ధర 3645 డాలర్లకు చేరింది. ప్రస్తుతం డాలర్ ధర రూ.8815 ఉంది. దీంతో ఇండియాలో కూడా బంగారం ధర విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 1, 12, 800 కు చేరింది. 2024 డిసెంబర్ 31న పది గ్రాముల ధర రూ. 78,950తో పోలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు బంగారం ధర 43 శాతం అంటే దాదాపు రూ. 33,800 దాకా పెరిగింది. 

వెండి కూడా పరుగులు..

బంగారానికి తగ్గట్టుగానే వెండి ధర కూడా పెరుగుతోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో కిలో వెండి ధర రూ.15 లక్షలకు చేరుకుంది. పారిశ్రామిక డిమాండ్, డాలర్ బలహీనపడడమే దీనికి కారణం అని చెబుతున్నారు.  అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేటు 50 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే 2025లో పారిశ్రామిక డిమాండ్​లో వెండి వాటా 60 శాతం వరకు ఉండొచ్చని యుఎస్ సిల్వర్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్  చెబుతోంది. 

Advertisment
తాజా కథనాలు