/rtv/media/media_files/2026/03/02/iran-us-war-2026-03-02-14-00-39.jpg)
Iran US War
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేసి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నాయకత్వాన్ని కూల్చేసింది. ఈ దాడుల్లో ఖమేనీ(ali khamenei) తో సహా ఆయన కుటుంబ సభ్యులు, ఇతర కీలక నేతలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ అమెరికా లక్ష్యం నెరవేరనట్లు కనిపిస్తోంది. ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీని నియమించింది. అలాగే అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు చేస్తోంది. ఇరాన్ దాడుల్లో ముగ్గురు అమెరికన్ సైనికులు మరణించారు. ఓ అమెరికన్ వైమానిక స్థావరం కూడా దెబ్బతింది.
శనివారం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్(iran israel war) పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్(Donald Trump) ఓ లక్ష్యంతోనే ఇరాన్‌పై ఈ దాడులు నిర్వహించారు. అదే పాలన మార్పు. ఖమేనీ నాయకత్వాన్ని కూల్చేయాలని ట్రంప్ ఎప్పటినుంచో భావిస్తున్నారు. 1951లో కూడా ఇరాన్ ప్రధానమంత్రి మొహమ్మద్ మొసాద్దిక్‌కు వ్యతిరేకంగా అమెరికా నిరసనలు చేయించింది. ఇందుకోసం ఇరాన్ చక్రవర్తిగా ఉన్న మొహమ్మద్ రెజా పహ్లవీని కూడా నిరసనలు రెచ్చగొట్టేందుకు వాడుకుంది. 1953 తర్వాత ఇరాన్ పూర్తిగా అమెరికా గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. మొహమ్మద్ రెజా పహ్లవీ ఇరాన్ పాలన బాధ్యతలు స్వీకరించారు.
Also Read: ఇరాన్‌కు మరో బిగ్ షాక్.. తాత్కాలిక సుప్రీం లీడర్ మృతి ?
Donald Trump Remains Unfulfilled Even After Killing Khamenei
చివరికి 1979లో ఇస్లామిక్ విప్లవం జరగడంతో అయతుల్లా ఖొమేనీ అధికారంలోకి వచ్చారు. 1989లో ఆయన మృతి చెందడంతో అయతుల్లా అలీ ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పడు కూడా ట్రంప్ యంత్రాగం ఇరాన్‌లో పాలనను మార్చి తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోంది. ముందుగా ఖమేనీని లొంగదీసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
మరోవైపు ఇరాన్ అణ్వాయుధ శక్తిగా మారేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీన్ని అడ్డుకోవడం కూడా అమెరికా లక్ష్యం. అణ్వాయుధాలు తయారుచేయాలంటే యురేనియాన్ని 90 శాతం శుద్ధి చేయాలి. ఇరాన్ ఇప్పటికే 60 శాతం శుద్ధి చేసినట్లు తెలిసింది. అందుకే ఇరాన్‌పై ఆంక్షలు విధించింది. అణుఒప్పందంలో రాజీకి రావాలని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలోనే ట్రంప్ ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులు చేసి ఖమేనీని హతమార్చారు.
ఖమేనీ చనిపోయినప్పటికీ ఇరాన్ ఇంకా ఓడిపోలేదు. అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంది. గతంలో ట్రంప్ ఇరాన్‌తో యుద్ధం నాలుగు రోజులు మాత్రమే ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడు నాలుగు వారాలు పట్టొచ్చని అంటున్నారు. ప్రస్తుతం చూసుకుంటే ఖమేనీ మరణం తర్వాత ఆయన పాలనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు జరగడం లేదు. దీన్నిబట్టి ట్రంప్ పాలన మార్పు లక్ష్యం నెరవేరనట్లు కనిపిస్తోంది.
Also Read: పక్కా ప్లాన్‌తో ఖమేనీకి స్పాట్.. అమెరికా ఎలాంటి టెక్నాలజీ వాడిందో తెలుసా?
Follow Us