Khamenei Death: పక్కా ప్లాన్‌తో ఖమేనీకి స్పాట్.. అమెరికా ఎలాంటి టెక్నాలజీ వాడిందో తెలుసా?

ఇజ్రాయెల్, అమెరికా చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందడం ప్రపంచ దేశాలను షాక్‌కు గురిచేసింది. అయితే ఈ దాడి ఒక్కరోజులో చేసింది కాదు. అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థలు కొన్ని నెలల ముందే ప్లాన్ చేశాయి.

New Update
CIA tracked Khamenei for months, killed him in two hours and five minutes

CIA tracked Khamenei for months, killed him in two hours and five minutes

ఇజ్రాయెల్, అమెరికా చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందడం ప్రపంచ దేశాలను షాక్‌కు గురిచేసింది. అయితే ఈ దాడి ఒక్కరోజులో చేసింది కాదు. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA), ఇజ్రాయెల్‌కు చెందిన ఇంటెలిజెన్స్‌ సంస్థ మొసాద్ కొన్ని నెలల నుంచే ఖమేనీతో సహా ఇతర సీనియర్ నేతల కదలికలను పర్యవేక్షించాయి. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్‌ సంస్థలు కలిసి ఖమేనీ రోజువారీ కార్యక్రలాపాలను నిరంతరం పరిశీలించేవి. అతను ఎక్కడు ఉంటున్నాడు. ఎవరిని కలుస్తున్నాడు. ప్రమాదం జరిగినప్పుడు ఎక్కడ దాక్కుంటున్నాడనే విషయాలు తెలుసుకున్నారు. కేవలం రెండు గంటల్లోనే దాడులు చేసి ఖమేనీని హతమార్చాయి.    

ఇక వివరాల్లోకి వెళ్తే.. శనివారం ఉదయం టెహ్రాన్‌లోని ఒక రహస్య కాంపౌండ్‌లో ఇరాన్ ఉన్నతాధికారులతో ఖమేనీ(Khamenei Death) భేటీ కానున్నట్లు CIAకు కచ్చితమైన సమాచారం వచ్చింది. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ రాత్రి పూట దాడి చేయాలని భావించినా ఖమేనీ అక్కడ ఉన్నారో లేదో సరైన సమాచారం లేదు. చివరికి ఖమేనీ అక్కడ ఉన్నట్లు నిర్ధారించుకున్నాక ఇజ్రాయెల్ సమయం ప్రకారం ఉదయం 6 గంటల ప్రాంతంలో, యుద్ధ విమానాలు అత్యంత ఖచ్చితమైన ఆయుధాలతో ఖమేనీ నివాసాలపై దాడులు చేశాయి. ఈ దాడిలోనే ఖమేనీ, అతడి కుటుంబ సభ్యులు చనిపోయారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్‌ పెజష్కియాన్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. కానీ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. 

Also Read: లెబనాన్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్..

మూడు వేర్వేరు ప్రదేశాల్లో దాదాపు 60 సెకండ్లలోనే ఈ దాడులు జరిగినట్లు ఇజ్రాయెల్(israel iran war) సైనిక అధికారి తెలిపారు. ఈ దాడుల్లో ఖమేనీ, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ అధిపతితో సహా దాదాపు 40 మంది సీనియర్ అధికారులు సైతం మృతి చెందారు. ఖమేనీ ఉంటున్న నివాసంపై ముందుగా దాడి చేయకపోతే.. వాళ్లు అప్రమత్తమై దాక్కునేవారని ఇజ్రాయెల్ సైనిక అధికారి అన్నారు. ఈ దాడులు జరిగిన కొన్ని గంటల తర్వాత.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖమేనీ మరణించినట్లు ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. 

శాటిలైట్ నిఘా 

ఖమేనీ జాడను ట్రాక్ చేసేందుకు సీఐఏ, ఇజ్రాయెల్‌కు చెందిన మొసాద్.. హైరిజల్యూషన్ ఇమేజింగ్‌ శాటిలైట్‌లను వాడారు. ఇవి నేలపై ఉండే వ్యక్తులు, వాహనాల కదలికలను నిరంతరం పర్యవేక్షించి ట్రాక్ చేయగలవు. ఖమేనీ నివసించే కాంపౌండ్ లోపలికి వెళ్లే వాహనాల నంబర్ ప్లేట్లను, భద్రతా సిబ్బంది, వారి అసాధారణ కదలికలను ఈ శాటిలైట్లు నిరంతరం ఫోటోలు తీస్తూ డేటాను అందించాయి. 

సిగ్నల్ ఇంటెలిజెన్స్‌ 

సిగ్నల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫోన్ కాల్స్, రేడియో సిగ్నల్స్, ఇంటర్నెట్ ట్రాఫిక్, ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్‌లను పర్యవేక్షించాయి. ముఖ్యంగా ఖమేనీకి అత్యంత సన్నిహితంగా ఉండే భద్రతా అధికారులు వాడే ఫోన్లు , ఎన్‌క్రిప్టెడ్ రేడియో సిగ్నల్స్‌ను డీకోడ్ చేశాయి. దీనివల్ల ఖమేనీ కచ్చితంగా ఏ గదిలో ఉన్నారో కనిపెట్టేందుకు ఈ డేటాను వాడాయి. 

నిఘా స్టీల్త్ డ్రోన్

ఖమేనీ కదలికలు కనిపెట్టేందుకు అమెరికా, ఇజ్రాయెల్ అత్యున్నత స్థాయి 'స్టీల్త్' నిఘా డ్రోన్‌లను ఉపయోగించాయి. ఇరాన్ వద్ద ఉన్న రష్యన్ తయారీ S-300, S-400 వైమానిక రక్షణ వ్యవస్థలను తప్పించుకుని ఇరాన్‌ ఆకాశంలోకి ప్రవేశించడం సాధ్యం కాదు. అందుకే ఈ స్టీల్త్ టెక్నాలజీని వినియోగించారు. ఇది రాడార్లకు దొరక్కుండా ఎంతో ఎత్తులో ఎగురుతూ, కింద ఉండే వ్యక్తుల ముఖాలను కూడా గుర్తించగలదు. ఖమేనీ కాంపౌండ్‌పై ఏమాత్రం శబ్దం లేకుండా గంటల తరబడి అక్కడ తిరుగుతూ లైవ్ వీడియో ఫీడ్‌ను అమెరికాకు పంపింది. - iran israel us war

Also Read: భీకర యుద్ధం.. టెహ్రాన్‌లోని గాంధీ ఆస్పత్రిపై దాడులు.. షాకింగ్ వీడియో

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) 

వేలాది శాటిలైట్ ఫుటేజీని చూడటం అనేది చాలా కష్టం అవుతుంది. అందుకే CIA ఏఐ అల్గారిథమ్‌లను వాడింది. ఈ ఏఐ సిస్టమ్ ఖమేనీ లొకేషన్‌కు సంబంధించి విశ్లేషణలు చేసింది. శనివారం ఉదయం ఆయన ఆ నిర్దిష్ట ప్రదేశంలో ఉండే అవకాశం 99 శాతం ఉన్నట్లు ముందే అంచనా వేసింది. ఈ హై-రిజల్యూషన్ ఇమేజింగ్ వల్ల దొరికిన డేటాను డైరెక్ట్‌గా ఇజ్రాయెల్ యుద్ధ విమానాల (F-35s) నావిగేషన్ సిస్టమ్‌కు లింక్‌ చేశారు. దీనివల్ల చుట్టుపక్కల భవనాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా.. ఖమేనీ ఉన్న భవనంపైనే ఈ బాంబు దాడులు జరిగాయి ఇలాంటి సాంకేతికతలను వినియోగించి ఇజ్రాయెల్,అమెరికా పక్కా ప్లాన్‌తో ఖమేనీ నివాసంపై దాడులు చేసి తాము అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాయి. 

Advertisment
తాజా కథనాలు