బంగ్లాదేశ్ లో మైనార్టీలు తిరగబడ్డారు. హిందువులు, బుద్ధిస్ట్ లమీద దాడులు ఎక్కువ అయ్యాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా ఆందోళనలు చేపట్టారు. తాము ఇంక బంగ్లాదేశ్ లో ఉండలేమని...ఇండియాలో కలుస్తామంటూ తీవ్రంగా నిరసనలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఛత్తో గ్రామ్ ఆందోళనలు, అల్లర్లతో అట్టుడుకుతోంది.
మమ్మల్ని బతకనివ్వడం లేదు..
మైనార్టీలను చంపుతున్నారని, అత్యాచారాలను చేస్తన్నారని ఛత్తో గ్రామ్ వాసులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం భారత్ మాత్రమే తమను ఆదుకోగలదని అంటున్నారు. అక్కడి తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. మరోవైపు ఈ నిరసనలు అణిచివేయడానికి బంగ్లా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దాంతో పాటూ భారత్ పై నిందలు కూడా వేస్తోంది. ఆందోళనల వెనుక భారత్ ఉందంటూ బంగ్లాదేశ్ ఆరోపిస్తోంది. నిరసనకారులకు ఆయుధాలను సప్లై చేస్తోందంటూ లేని పోని అబద్ధాలను ప్రచారం చేస్తోంది.
What’s happening? After PoJK now Chattogram(Chittagong), Bangladesh is protesting against their government and wants to join India😱🥰#AkhandBharathpic.twitter.com/O5EfDap6JV
— Chakravarty Sulibele (@astitvam) September 29, 2025
గతేడాదీ ఇవే అల్లర్లు..
గతేడాది బంగ్లాదేశ్ లో మైనార్టీలపై విపరీతమైన దాడులు జరిగాయి. షేక్ హసీనా రాజీనామా తర్వాత ఆగస్టు 5 నుంచి అక్టోబరు 22 మధ్యకాలంలో మైనారిటీలపై 88 మతపరమైన హింసాత్మక ఘటనలు జిగాయని అక్కడి ప్రభుత్వమే అంగీకరించింది. ఇందులో ఎక్కువగా దాడులు హిందువుల మీదనే జరిగాయని తెలిపింది. ఈ ఘటనల్లో 70 మందిని అరెస్ట్ చేశామని బంగ్లా తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి షఫీకుల్ ఆలమ్ ప్రకటించారు. ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయిని చెప్పారు. హిందువులు, మైనరిటీలపై దాడులు మరిన్ని మరిన్ని ఘటనలు సమీపకాలంలో జరగొచ్చని...అరెస్టులు కూడా ఉండొచ్చని యూనస్ అన్నారు. మైనార్టీలపై జరిగిన దాడుల్లో.. జూలై 1 నుంచి ఆగస్టు 15 మధ్యలో జరిగిన విద్యార్థలు ఆందోళనల్లో మొత్తం 1400 మంది మృతి చెందారని...వారిలో 13శాతం చిన్నారులే అని ఐక్యరాజ్య సమితి నివేదికలో తెలిపింది.
ఇక షేక్ హసీనా ప్రభుత్వం పతనమయ్యాక...యూనస్ ఖాన్ తాత్కాలిక సీఎంగా బాధ్యతలు స్వీకరించారు అప్పటి నుంచి అక్కడ హిందువులు, మైనారిటీల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఠాకుర్ గావ్, లాల్ మొనిర్ హట్, దినాజ్ పుర్, సిల్హెట్, కుల్నా, రంగ్ పుర్ వంటి చారిత్రక ప్రాంతాలతోపాటు గ్రామాల్లో ఈ దారుణాలు చోటు చేసుకున్నాయి.మత ఘర్షణలకు భయపడి పలు గ్రామాలకు చెందిన సుమారు 3000-4000 మంది హిందువులు భారత్ సరిహద్దుకు చేరుకుని అక్కడ ఆశ్రయం పొందుతున్నారని ఐక్యరాజ్య సమితి తెలిపింది.