/rtv/media/media_files/2025/09/05/putin-2025-09-05-20-14-59.jpg)
Putin
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ మద్దతుగా ఆ దేశంలో తమ సైనికులను మోహరించే దేశాలను తాము టార్గెట్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో తమకు వ్యతిరేకంగా పోరాడే దేశాలను లక్ష్యాలుగా చేసుకునే అధికారం తమకు ఉందని హెచ్చరించారు. ఇలాంటి బలగాల మోహరింపు అనేది దీర్ఘకాలిక శాంతికి అనుకూలంగా ఉండదంటూ పేర్కొన్నారు. పశ్చిమ దేశాలతో ఉక్రెయిన్‌కు ఉన్న దగ్గరి సంబంధాలే ఈ యుద్ధానికి మూల కారణమంటూ విమర్శలు చేశారు.
Also Read: కొడుకు మెడపై కత్తి పెట్టి.. తల్లి బట్టలు విప్పించిన డెలివరీ బాయ్
Putin Warns To Europe Countries
ఇరుదేశాల మధ్య శాంతిచర్చలు సక్సెస్ అయ్యి యుద్ధం ఆగిపోతే.. ఉక్రెయిన్‌కు సపోర్ట్‌గా అక్కడ ఇతర దేశాల సైనికులను మోహరించాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీర్ఘకాలిక శాంతి కోసం నిర్ణయాలు తీసుకుంటే అక్కడ దళాలు మోహరించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. అంతేకాదు తాము చేసుకున్న ఒప్పందానికి రష్యా కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. మొత్తం 26 ఐరోపా దేశాల నేతలు గురువారం ప్యారిస్‌లో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్యారిస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఐరోపా దేశాధినేతలు సమావేశమయ్యారు. అక్కడ ఉక్రెయిన్‌కు కావాల్సిన భద్రతా హమీలు గురించి చర్చలు జరిపారు. అమెరికా నుంచి ప్రత్యేక రాయబారి విట్కాఫ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. దీనికి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ అలాగే యూకే ప్రధాని కీర్ స్టార్మర్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా మెక్రాన్ మాట్లాడారు. ఉక్రెయిన్ భద్రతకు ఐరోపా హామీగా ఉంటుందని చెప్పారు. కానీ దీనికి సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు. శాంతిచర్చలు ఫలించి యుద్ధం ఆగిపోతే ఉక్రెయిన్‌కు అండగా ఉండేందుకు ఆ దేశంలో తమ సైన్యాలను మోహరించేందుకు 26 ఐరోపా దేశాలు రెడీగా ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు ఉక్రెయిన్‌కు సుధీర్ఘ శ్రేణి మిసైల్స్‌ను సరఫరా చేసేందుకు ఐరోపా కూటమి నిర్ణయించినట్లు కూడా చెప్పారు.
Also Read: వినాయక మండపం వద్ద ఆడుకుంటుండగా 10 ఏళ్ల బాలుడికి గుండెపోటు.. తల్లి ఒడిలోనే