Pakistan: పాక్‌కు బిగ్ షాకిచ్చిన చైనా.. మెగా ప్రాజెక్ట్ నుంచి అవుట్.. అట్టడుగునున్న ఆర్థిక సంక్షోభం!

పాకిస్తాన్‌కు చైనా బిగ్ షాకిచ్చింది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటం కోసం పాక్ చేపట్టిన భారీ రైల్వే ప్రాజెక్టు నుంచి చైనా తప్పుకుంది. చైనా తప్పుకోవడంతో నిధుల కోసం పాక్ ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌ను ఆశ్రయించింది.

New Update
pakistan

pakistan

పాకిస్తాన్‌కు చైనా బిగ్ షాకిచ్చింది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటం కోసం పాక్ చేపట్టిన భారీ రైల్వే ప్రాజెక్టు నుంచి చైనా తప్పుకుంది. దీంతో పాక్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల బారిన పడింది. చైనా తప్పుకోవడంతో నిధుల కోసం పాక్ ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌ను ఆశ్రయించింది. అయితే పాక్‌లో కరాచీ నుంచి పెషావర్ వరకు ఉన్న మెయిన్ లైన్ 1 రైల్వే  ప్రాజెక్ట్ కోసం చైనా భాగమైంది. భారీ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారుగా 9.8 బిలియన్ డాలర్లు.  ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే పాకిస్తాన్‌లో రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని భావించి చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌కు చైనా పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాక్ సందిగ్ధంలో పడింది. 

ఇది కూడా చూడండి: Putin: ఇండియా, చైనా జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!

పాక్, చైనా దేశాలు మిత్ర దేశాలు. కానీ ఇలాంటి కష్ట సమయాల్లో పాక్‌కు సాయం చేయకుంండా కఠిన నిర్ణయం తీసుకోవడంతో దీని వెనుక ఏదో పెద్ద కారణమే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ అమెరికాతో  స్నేహం చేయడం, దగ్గర కావడం వల్ల చైనాకు నచ్చడం లేదని అంటున్నారు. ఈ కారణం వల్లనే చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరికొందరు పాక్ అప్పుల్లో ఉందని, ఇప్పుడు మళ్లీ సాయం చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించి ఈ భారీ ప్రాజెక్టు నుంచి వెనక్కి తగ్గినట్లు సమాచారం. చైనా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో పాకిస్తాన్‌కు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. రుణాల కోసం పాకిస్తాన్ వెతకడం ప్రారంభించింది.

ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకును ఆశ్రయించిన పాక్..

ఈ భారీ రైల్వే ప్రాజెక్టుకు నిధులు సమకూర్చమని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకును ఆశ్రయించింది. 1.72 లక్షల కోట్లు సుమారుగా రుణం ఇవ్వాలని ఏడీబీని పాక్ కోరింది. ఈ రైల్వే ప్రాజెక్టు కరాచీ నుంచి పెషావర్ వరకు దాదాపు 1,800 కిలోమీటర్లుకి అప్‌గ్రేడ్ చేయనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు పది సంవత్సరాల పాటు పాక్ దౌత్య పరమైన చర్యలు జరిపింది. కానీ ఇప్పటికీ ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. అయితే ప్రాజెక్టుకు ఇప్పుడు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) నిధులు సమకూరుస్తోంది. అలాగే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) ప్రాజెక్టుకు నాయకత్వం వహించడానికి ఒప్పుకుంది. 

ఇది కూడా చూడండి: Donald Trump: ఆ కంపెనీ సీఈఓకు ట్రంప్‌ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇండియాపై మరోసారి అక్కసు!

Advertisment
తాజా కథనాలు