/rtv/media/media_files/2025/09/05/noida-crime-2025-09-05-19-46-13.jpg)
డెలివరీ బాయ్ ఓ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించాడు. బెడ్‌పై నిద్రిస్తున్న కొడుకు మెడపై కత్తి ఉంచి మహిళను బెదిరించాడు. బలవంతంగా ఆమెతో దుస్తులు విప్పించి వీడియో రికార్డ్ చేశాడు. కన్న కొడుకు ప్రాణాలు కాపాడాటానికి తప్పని పరిస్తితిలో ఆ తల్లి దుండగుడు చెప్పినట్లు వినాల్సి వచ్చింది. ఆ వీడియోతో ఆ మహిళను బ్లాక్‌మెయిల్ చేశాడు. ఆమె ఫిర్యాదుతో డెలివరీ బాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది.
In Noida, a delivery boy held a child hostage and forced his mother to strip while the accused recorded the act to later blackmail her. pic.twitter.com/awJcxXKoiS
— Piyush Rai (@Benarasiyaa) September 5, 2025
గులిస్తాన్‌పూర్‌కు చెందిన 22 ఏళ్ల గౌరవ్ ఓ మహిళ ఇంటికి పాలు, కిరాణా సామాగ్రి డెలివరీ చేసేవాడు. ఒక రోజు ఉదయం ఆమె ఇంట్లోకి బలవంతంగా అతడు ప్రవేశించాడు. బెడ్‌పై నిద్రిస్తున్న మహిళ కుమారుడి మెడపై కత్తి ఉంచాడు. ఆ బాలుడ్ని చంపుతానని బెదిరించాడు. బలవంతంగా ఆమెతో బట్టలు విప్పించాడు. మొబైల్ ఫోన్‌లో దానిని రికార్డ్ చేశాడు. మహిళ ఫిర్యాదులో డెలివరీ బాయ్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ వార్త ఈ కామర్స్ వినియోగదారుల్లో భయాందోళనలు కలిగిస్తోంది. ఇలాంటి ఘాతుకాలకు పాల్పాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ సంఘటన గురించి చక్కర్లు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.