Heart Attack : వినాయక మండపం వద్ద ఆడుకుంటుండగా 10 ఏళ్ల బాలుడికి గుండెపోటు.. తల్లి ఒడిలోనే

మహారాష్ట్రలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.  కొల్హాపూర్‌లో గుండె పోటుతో పదేళ్ల బాలుడు మృతి చెందాడు. వినాయక మండపం వద్ద ఆడుకుంటుండగా అస్వస్థతకు గురైన బాలుడు.. ఇంటికి వెళ్లి తల్లి ఒడిలో పడుకున్న కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు.

New Update
ganesh

మహారాష్ట్ర(maharashtra) లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.  కొల్హాపూర్‌(kolhapur) లో గుండె పోటు(heart-attack) తో పదేళ్ల బాలుడు మృతి చెందాడు. వినాయక మండపం వద్ద ఆడుకుంటుండగా అస్వస్థతకు గురైన బాలుడు.. ఇంటికి వెళ్లి తల్లి ఒడిలో పడుకున్న కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని శ్రావణ్ గవాడేగా గుర్తించారు.  శ్రావణ్ 4వ తరగతి చదువుతున్నాడు. అతని తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. ఆ కుటుంబం నాలుగు సంవత్సరాల క్రితం తమ చిన్న కుమార్తెను కోల్పోయింది, ఇప్పుడు శ్రావణ్ కూడా అకస్మాత్తుగా మరణించాడు. ఒకదాని తర్వాత ఒకటి జరిగిన ప్రమాదాల జరగడంతో  గవాడే కుటుంబంపై దుఃఖంలో మునిగిపోయింది. ఈ సంఘటన కోడోలి గ్రామం మొత్తాన్ని కదిలించింది. కాగా మరో సంఘటనలో ఆగస్టు 31న ముంబైలోని ఆజాద్ మైదానంలో 45 ఏళ్ల మరాఠా కోటా నిరసనకారుడు గుండెపోటుకు గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు.  

Also Read :   విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. రూ.23 లక్షల స్కాలర్‌షిప్

Also Read :   ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం..స్పాట్ లో 161 మంది!

గుండెపోటుకు కారణాలు వేరుగా

ఇటీవలి కాలంలో జీవనశైలి మార్పుల వల్ల గుండెపోటు కేసులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పెద్దవారిలో గుండెపోటుకు కారణాలు వేరుగా ఉండగా, పిల్లలలో మాత్రం దీనికి ప్రత్యేక కారణాలు ఉంటాయి.కొంతమంది పిల్లలు పుట్టుకతోనే గుండె నిర్మాణంలో లోపాలతో జన్మిస్తారు. దీని వల్ల రక్త ప్రసరణ సరిగా ఉండదు, గుండెపై భారం పెరిగి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఆధునిక జీవనశైలి, ఊబకాయం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పిల్లలలో కూడా అధిక కొలెస్ట్రాల్, రక్తపోటుకు కారణమవుతున్నాయి. ఇవి భవిష్యత్తులో గుండె సమస్యలకు దారితీస్తాయి.  పిల్లలకు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం అందించాలి. జంక్ ఫుడ్, అధిక కొవ్వు, చక్కెర పదార్థాలను తగ్గించాలి. పిల్లలు ప్రతిరోజూ కనీసం ఒక గంట పాటు శారీరక శ్రమ, ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి.

Advertisment
తాజా కథనాలు