/rtv/media/media_files/2024/11/02/x5llk8t9Gs6iTBmfypl7.jpeg)
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత పాలనలో ప్రభుత్వానికి శత్రువుగా వ్యవహరించిన మస్క్‌ను ఈసారి మాత్రం తీసుకొచ్చి పక్కనే పెట్టుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ విభాగాల్లో ప్రక్షాళన కోసం పలు కీలక విధానాలు తీసుకువచ్చే డోజ్ అధినేతగా మార్చారు. ఈక్రమంలోనే ట్రంప్, మస్క్‌లపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిపై తాజాగా మస్క్ షాకింగ్ కామెంట్లు చేశారు.
Also Read: Raddison Blue Drug Case:మరోసారి తెరమీదకి రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసు వ్యవహారం!
తాను చేస్తున్న పని వల్ల డెమోక్రాట్లు తనను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. డోజ్ సంస్కరణలు ఏమాత్రం నచ్చకపోవడమే అందుకు కారణం అని చెప్పారు.అమెరికాలో పన్ను చెల్లింపుదారుల ధనం దుర్వినియోగం అవుతున్న విషయాన్ని.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ బయటపెడుతున్నారంటూ ఓ నెటిజెన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు.
డెమోక్రాట్లకు ఈ విషయం బాగా అర్థం అవుతుందని.. మీ డబ్బులు తీసుకోవడం కోసం మస్క్ రాలేదంటూ వివరించాడు. అంతేకాకుండా మీ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వారి పేర్ల జాబితాను బయటకు తీసుకు వస్తున్నారంటూ వెల్లడించాడు. దీనికి మస్క్‌ను కూడా షేర్ చేయగా.. ఆయన స్పందించారు.
— Elon Musk (@elonmusk) February 25, 2025
చంపాలని చూస్తున్నారా...
దీనికి బదులు ఇస్తూనే.. అలా చేస్తున్నందుకే డెమోక్రాట్లు నన్ను చంపాలని చూస్తున్నారని అన్నారు. దీన్ని బట్టి చూస్తేనే ఇది ఎంత పెద్ద విషయమో మీరే అర్థం చేసుకోవచ్చని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన వారంతా నిజంగానే మస్క్‌ను డెమోక్రాట్లు చంపాలని చూస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ మస్క్‌కు చెబుతున్నారు కూడా.
Also Read:Trump: ఉద్యోగుల తొలగింపు పై ప్రణాళికలు రెడీ చేయండి..ట్రంప్ యంత్రాంగం ఆదేశాలు!
Also Read: USA: ట్రంప్ ప్రతిపాదనకు ఓకే చెప్పిన రష్యా..నో అన్న చైనా