/rtv/media/media_files/2025/02/27/aW4P5Yd6zcnWsDtoTS9z.jpg)
falcan -9 Photograph: (falcan -9 )
SpaceX launched IM-2: ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ విజయవంతంగా చంద్రుడిపైకి రాకెట్‌ను పంపించింది. ఎథీనా నోవా సి క్లాస్ లూనార్ ల్యాండర్‌ను గురువారం ఉదయం 5గంటలకు M1-2 రాకెట్ అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ఈ రాకెట్‌కు ఫాల్కన్ 9 అని పేరు పెట్టారు. మార్చి 6న చంద్రుని దక్షిణ ధ్రువంపై ఇది ల్యాండింగ్ అవుతుంది.
Like a giant Roman candle, @SpaceX's #Falcon9 rocket soared into the night sky on Wednesday, carrying @Int_Machines’ #IM2 lunar lander.
— 🚀Anthony Leone🌕 (@AnthonyLeone) February 27, 2025
The next stop: To the moon to search for water.
See more in my article at @MyNews13: https://t.co/5j0Swp1raB
Video by me. pic.twitter.com/bhI2JtrcOK
Also Read: AP: అన్నం కూడా తిననివ్వలేదు..అరెస్ట్ పై పోసాని భార్య
మూడవ మూన్ ల్యాండింగ్ మిషన్..
ఈ మిషన్ NASA కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ (CLPS) చొరవతో చంద్రునిపై మనుషుల మనుగడ సాధ్యమేనా పరిశీలిస్తుంది. ముఖ్యంగా చంద్రుడిపై మోన్స్ మౌటన్ ప్రాంతంలో కీలకమైన డేటాను సేకరించే టెక్నాలజీ ఇందులో ప్రవేశపెట్టారు. ఇది 2025 లో మూడవ మూన్ ల్యాండింగ్ మిషన్. ఇంట్యూటివ్ మెషీన్స్ నేతృత్వంలో కేప్ కెనావెరల్ నుంచి ఈ ప్రయోగం నింగిలోకి దూసుకెళ్లింది.
Lighting the way to the Moon: As @Int_Machines’ lander lifts off aboard a @SpaceX Falcon 9 rocket, it takes with it NASA science and tech. Its mission? To help us better understand the lunar environment in preparation for future human explorers. pic.twitter.com/KIx5vnpHRC
— NASA (@NASA) February 27, 2025
చంద్రుడిపైకి మానవులను పంపించేందుకు కీలకమైన డేటాను ఈ ప్రయోగం ద్వారా స్వేకరించనున్నారు. ఈ మిషన్‌లో చంద్రుడిపై తిరిగి పరిశోధించే రెండు రోవర్‌లు ఉన్నాయి. ఇంట్యూటివ్ మెషీన్స్ మైక్రో-నోవా హాప్పర్, మరొకటి మొబైల్ అటానమస్ ప్రాస్పెక్టింగ్ ప్లాట్‌ఫామ్ రోవర్. పోలార్ రిసోర్సెస్ ఐస్ మైనింగ్ ఎక్స్‌పెరిమెంట్-1 సూట్, లేజర్ రెట్రోరెఫ్లెక్టర్ అర్రే (LRA) వంటి కీలక సాధనాలను ఉపయోగించి చంద్రమండలంపై మట్టిని, నీటిని పరిశోధించనున్నారు. దీనితోపాటు చంద్రుడిపై గ్రేటర్లను పరిశీలించడానికి హోపింగ్ రోబోట్, గ్రేస్‌ను వదిలిపెట్టనున్నారు.
Also Read: Trump: ఉద్యోగుల తొలగింపు పై ప్రణాళికలు రెడీ చేయండి..ట్రంప్ యంత్రాంగం ఆదేశాలు!