/rtv/media/media_files/2025/02/27/6u6Aw5DaxHx4EIiZpvfJ.jpg)
Ibrahim Zadran Registers Highest Ever Score in Champions Trophy History
ఛాంపియన్స్ ట్రోఫీ అత్యంత ఉత్కంఠగా సాగుతోంది. ఇందులో భాగంగా నిన్న (బుధవారం) అఫ్గానిస్తాన్ Vs ఇంగ్లండ్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ విజయం సాధించింది. కేవలం 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ వీర బాదుడు బాదింది. ముఖ్యంగా అఫ్గాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ ఆట అద్భుతం. 146 బంతుల్లో 177 పరుగులు చేసి స్టేడియంలో అట్రాక్షన్‌గా నిలిచాడు.
ఇది కూడా చూడండి: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
అతడి విధ్వంసకర ఆటకు క్రికెట్ ప్రియులు ఫిదా అయిపోయారు. ఓపెనర్‌గా క్రీజ్‌లోకి వచ్చిన జద్రాన్ విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే మొదట్లో అఫ్గాన్ తడబడింది. కేవలం 3 వికెట్ల నష్టానికి 37 పరుగులే చేసింది. ఆ సమయంలో అఫ్గాన్ స్కోరు 200 దాటడమే ఎక్కువని భావించారు. కానీ జద్రాన్ తన బ్యాటింగ్ శైలితో దుమ్ము దులిపేశాడు.
ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో
గ్రౌండ్‌లో పరుగుల వరద పారించిన ఓపెనర్ జద్రాన్ ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టాడు. శతకానికి పైగా పరుగులు సాధించిన అతడు.. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ 165 వ్యక్తగత పరుగులతో అగ్ర స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ రికార్డును జద్రాన్ బ్రేక్ చేశాడు.
ఇది కూడా చూడండి: Aadi Pinishetty: భార్యతో ఆది పినిశెట్టి విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో
దీంతోపాటు వన్డేల్లో అత్యధిక స్కోర్ చేసిన అఫ్గాన్ బ్యాటర్‌గానూ ఇబ్రహీం జద్రాన్ మరో రికార్డు క్రియేట్ చేశాడు. ఇది మాత్రమే కాకుండా.. ఐసీసీ టోర్నీలో ఒక ఇన్నింగ్స్‌లో 150కి పైగా స్కోరు చేసిన పిన్న వయస్కుడిగా కూడా 23 ఏళ్ల జద్రాన్ అరుదైన ఘనత అందుకున్నాడు. కాగా జద్రాన్‌కు వన్డేల్లో ఇది 6 శతకం కావడం విశేషం. ఇలా జద్రాన్ పలు రికార్డులను బ్రేక్ చేసి.. కొత్త రికార్డులు క్రియేట్ చేయడంతో అఫ్గాన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.