/rtv/media/media_files/2025/09/19/omar-2025-09-19-11-19-02.jpg)
సోమాలీలో పుట్టి అమెరికా లో ఉంటున్న డెమోక్రటిక్ యూఎస్ కాంగ్రెస్ మహిళా నేత ఇల్హాన్ ఒమర్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా పౌరసత్వం పొందడానికి ఆమె తన సోదరుడిని వివాహం చేసుకుంది. ఇప్పుడేమో ఇల్హాన్ ఏకంగా నాకే అమెరికాను ఎలా నడపాలో చెబుతోంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి తన ట్రూత్ సోషల్ మీడియాలో పరిమితులకు మించి రాస్తూ పోస్ట్ పెట్టారు.
ట్రంప్, ఇల్హాన్ మధ్య వివాదం ఏంటి?
గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు, డెమోక్రటిక్ నేతల మధ్య వివాదం నడుస్తోంది. వీరిద్దరూ పలు విషయాలపై వాదులాడుకుంటున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక పలు నిర్ణయాలను తీసుకున్నారు. అక్రమవలసలు, పలు దేశాలపై ఎంట్రీ నిషేధం, శరణార్థుల కార్యక్రమాలను నిలిపేయడం వంటివి అందులో ముఖ్యమైనవి. వీటిపై ఇల్హాన్ ఒమర్ మొదటి నుంచీ వ్యతిరేక స్వరం వినిపిస్తూ వస్తున్నారు. దాంతో పాటూ ఆమె ట్రంప్ ను యూదు వ్యతిరేకి అంటూ ముద్ర కూడా వేశారు. దీన్ని ఈయన తీవ్రంగా ఖండించారు. సోమాలీ మూలాలు కలిగిన ఇల్హాన్ తనకు చెప్పడం ఏంటని పలుసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైనే తాజాగా మరోసారి విరుచకుపడ్డారు. వీరి వివాదం 2019 కు ముందు నుంచీ నడుస్తోంది. అంటే ట్రంప్ మొదటి టర్మ్ నుంచీ. అప్పుడే ౠయన ఇల్హాన్ ఒమర్ ను అమెరికా విడిచి సోమాలియా వెళ్ళిపోవాలని అన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే వ్యాఖ్యలను ట్రంప్ చేశారు.
చార్లీ కిర్క్ పై తీవ్ర వ్యాఖ్యలు..
తాజాగా హత్యకు గురైన ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ పై ఇల్హాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అతనొక సంప్రదాయ వదని...అతనికి నివాళులర్పించడంలో అర్థం లేదని అన్నారు. కిర్క్ ఒక ద్వేషపూరిత వ్యక్తిగా అభివర్ణించారు. అంతేకాదు నీచమైన వ్యక్తి చరిత్రను తిరిగి రాయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఇల్హాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటూ పనిలో పనిగా ట్రంప్ పై కూడా ఆమె ధ్వజమెత్తారు. ఆయన దగ్గర మూర్ఖులు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలే ట్రంప్ కు ఆగ్రహం తెప్పించాయి. ఓ ఓడిపోయిన మహిళ నాకు పాఠాలు నేర్పడానికి వచ్చిందంటూ రివర్స్ లో ఆయన ఇల్హాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్హాన్ ఒమర్ స్వయంగా సోమాలి శరణార్థి, 1995 లో అమెరికాకు వచ్చి ఐదు సంవత్సరాలు శరణార్థిగా నివసించారు. ఆమె 2000 లో అమెరికా పౌరసత్వం పొందింది.