/rtv/media/media_files/2025/09/19/pak-saudi-2025-09-19-09-35-11.jpg)
సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య రక్షణ ఒప్పందం జరిగింది. సౌదీ అరేబియాలో జరిగిన ముస్లిం దేశాల సమావేశానికి పాకిస్తాన్ కూడా హాజరయ్యింది. దాంతో పాటూ ఆ దేశంతో పాకిస్తాన్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. దీని ప్రకారం ఆ రెండు దేశాలలో దేనిపైనైనా దాడి జరిగితే అది రెండు దేశాలపై దాడిగా పరిగణిస్తారు. సౌదీ అరేబియా బలమై దేశం. దాంతో పాటూ బాగా పలుకుబడి డబ్బులు ఉన్న దేశం. వారి దగ్గర అధునాతన ఆయుధాలు కూడా ఉన్నాయి. ఇలాంటి దేశం పాకిస్తాన్ కు అండగా నిలిస్తే...ఎవరైనా వీరిపై గెలవడం చాలా కష్టమే అవుతుంది.
పాక్ కు అదనపు బలం..
పాకిస్తాన్ తో ఒప్పందం చేసుకున్న సౌదీ అరేబియా చాలా బలమైన దేశం. దీని దగ్గర డబ్బులే కాదు..సైనిక బలం కూడా చాలా ఎక్కువే ఉంది అని తెలుస్తోంది. దానికి తోడు పాక్ సౌదీలు అణ్వాయుధాల గురించి కూడా ఒప్పందం చేసుకున్నాయి. అయితే పూర్తి ఒప్పందం ఏంటో ఇంకా వివరాలు తెలియడం లేదు కానీ..దీని వలన మిగతా దేశాలకు పెద్ద వార్నింగే కానుంది. ఇంతకు ముందు వరకు సౌదీ అరేబియా...తన భద్రత కోసం అమెరికా మీద ఆధారపడింది. కానీ గత కొన్నేళ్ళుగా తన సైనిక బలాన్ని గణనీయంగా పెంచుకుంది. ఇప్పుడు తమ దేశ భద్రతా వ్యూహాన్ని వారే రూపొందించుకుంటున్నారు. ఇందులో భాగంగానే పాకిస్తాన్ తో రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని చెబుతున్నారు.
సౌదీ అరేబియా సైనిక శక్తి..
సౌదీ అరేబియా తన ఆయుధాలను ఎక్కువగా అమెరికా, చైనా యూరోపియన్ దేశాల నుంచి కొనుగోలు చేస్తోంది. ఈ దేశం దాదాపు 280 యుద్ధ విమానాలను కలిగి ఉంది. వీటిలో ఎక్కువగా అమెరికా తాలూకా ఎఫ్ 15 ఎస్, ఎఫ్ 15 సీలే ఉన్నాయి. వీటికి తోడు జర్మన్-ఆధారిత యూరోఫైటర్ టైఫూన్స్ , పనావియా టోర్నాడో జెట్లను కూడా కలిగి ఉంది. అంతేకాదు సౌదీ అరేబియాలో THAAD, పేట్రియాట్ లాంటి అమెరికన్ నిర్మిత రక్షణ వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఇంతకు మించి కూడా ఆ దేశం దగ్గర ఉన్నాయని..ఆ వివరాలు బయటకు తెలియదని చెబుతున్నారు. వీటన్నిటితో పాటూ చైనా నుండి కొనుగోలు చేసిన రెండు మధ్యస్థ-శ్రేణి క్షిపణులు - DF-3, DF-21 - ఉన్నాయి. ఇవన్నీ కాకుండా సౌదీ అరేబియా, పాకిస్తాన్ రెండూ అణ్వాయుధాలను కూడా కలిగి ఉన్నాయి. రెండిటిలో ఎవరికి అవసరం అయినా ఒక దేశం నుంచి మరొక దేశానికి ఆయుధాలతో పాటూ అణ్వాయుధాలు కూడా వస్తాయి. రెండు దేశాలూ కలిపే యుద్ధం చేస్తాయి. ప్రపంచ రక్షణ వ్యయంలో సౌదీ అరేబియా ప్రపంచంలో ఏడవ స్థానంలో ఉండగా, పాకిస్తాన్ 29వ స్థానంలో ఉంది.
Also Read: Indian stores in USA: ట్రంప్ టారిఫ్ లు..అమెరికాలో భారత వ్యాపారాలు కుదేలు