Trump: ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు పంపిస్తాం.. ట్రంప్ సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కు తాము అదనపు ఆయుధాలు పంపిస్తామని అన్నారు. ఉక్రెయిన్‌పై చేసిన యుద్ధంలో తాము కొత్త లాభాలు ఆర్జించామని రష్యా ప్రకటించిన తర్వాత ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

New Update
Donald Trump

Donald Trump

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓ వైపు కాల్పుల విరమణ కోసం చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఇరుదేశాలు మాత్రం ఒకదానిపై మరొకటి విరుచుకుపడుతున్నాయి. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కు తాము అదనపు ఆయుధాలు పంపిస్తామని అన్నారు. ఉక్రెయిన్‌పై చేసిన యుద్ధంలో తాము కొత్త లాభాలు ఆర్జించామని రష్యా ప్రకటించిన తర్వాత ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

Also Read: ఎమ్మెల్యే ఇంట్లోనే దొంగల దోపిడి.. అప్పటికి ఎన్ని సార్లు చేశారో తెలుసా..?

US To Send ‘More’ Weapons To Ukraine

గతవారం అమెరికా కూడా ఉక్రెయిన్‌కు పలు ఆయుధాలను పంపిణీ చేయడాన్ని ఆపుతున్నామని ప్రకటించింది. దీంతో ఉక్రెయిన్‌కు రష్యా నుంచి ఇది సవాలుగా మారింది. అంతేకాదు ఉక్రెయిన్‌లోని డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలోని తమ బలగాలు తమ మొదటి గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నాయని రష్యా సోమవారం తెలిపింది. ఈ క్రమంలోనే అదేరోజు ట్రంప్‌ ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు పంపిస్తున్నాని వైట్‌హౌస్‌లోని మీడియా సమావేశంలో చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్యలపై తాను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.  

Also Read: ఘోర ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. నుజ్జునుజ్జైన బస్సు

అయితే రష్యా ఈ ప్రకటన చేసేముందు ఉక్రెయిన్‌పై పెద్దఎత్తున డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. అలాగే ఉక్రెయిన్‌కు చెందిన మిలిటరీ రిక్రూట్‌మెంట్‌ కేంద్రాలపై కూడా దాడులకు దిగింది. ఆ తర్వాత మాస్కోలోని అక్కడి ఆయుధాల ఫ్యాక్టరీపై తాము కూడా డ్రోన్లతో దాడులు చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. ఇదిలాఉండగా.. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిని అయ్యాక రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేస్తానన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కూడా ఇరుదేశాల మధ్య ఈ యుద్ధం ఆగడం లేదు. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితులు ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని ఇరుదేశాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 

Also Read: 10 ఏళ్లుగా డాక్టర్లు గుర్తించని వ్యాధి.. క్షణాల్లో గుర్తించిన చాట్‌జీపీటీ

Also Read :  రేవంత్‌ రెడ్డికి చర్చ చేయడం రాదు.. అందుకే ఢిల్లీకి పారిపోయిండు..కేటీఆర్‌ కీలకవ్యాఖ్యలు

ukraine | russia | rtv-news | telugu-news

Advertisment
తాజా కథనాలు