/rtv/media/media_files/2025/07/08/congress-mla-deen-dayal-bairwa-house-thefts-2025-07-08-12-33-41.jpg)
Congress MLA Deen Dayal Bairwa house thefts
Crime News: రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే దీన్ దయాల్ బైర్వా ఇంట్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఇటీవల తాను ఎదుర్కొంటున్న చోరీ సంఘటనలు ఆయనను కలవర పెడుతున్నాయి . జూన్ 11న దౌసాలో మాజీ కేంద్ర మంత్రి రాజేశ్ పైలట్ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మొబైల్ ఫోన్ అదృశ్యమైంది. ఈ సంఘటన జరిగిన కొద్దిరోజులకే ఆయన ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉంచిన మోటార్‌సైకిల్‌ను ఎవరో అపహరించారు. ఈ ఘటన మర్వువకముందే ట్రాక్టర్ ట్రాలీ దొంగల చేతికి చిక్కింది.
Also Read: Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద
చోరీలు జరిగాయంటూ నిరాశ..
ఈ వరుస ఘటనలతో ఎమ్మెల్యే దీన్‌దయాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పని చేస్తున్న అతనికి రక్షణ లేకుండా పోతే... సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆవేదనతో ప్రశ్నించారు. ఒకప్పుడు తనకు సంబంధించి చిన్న ఇనుప ముక్క కూడా దొంగిలించబడిన సందర్భం లేదని, కానీ ఇప్పుడు వరుసగా మూడు చోరీలు జరిగాయంటూ నిరాశ వ్యక్తం చేశారు. ద్విచక్రవాహనం పోయిన రోజు సీసీ కెమెరాలు పనిచేయలేదని.. ఇంట్లో జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా అవి తొలగించబడ్డాయని వివరించారు. అయితే కెమెరాలు ఉన్నా దొంగలు తమను కవర్ చేసుకుంటే ఎలా గుర్తిస్తామని ఆయన ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: మీకు తెలుసా ఈ ఫేస్ ప్యాక్ 15 నిమిషాల్లో ముఖం మిలమిల మెరిసిపోతుంది!
మరోవైపు దౌసా ఎస్పీ సాగర్ ఈ ఘటనలపై స్పందించారు. ట్రాక్టర్ ట్రాలీ దొంగతనంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని.. అయితే ఫోన్ చోరీ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదైనట్టు తెలిపారు. ఈ సంఘటనలు రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లో ఎమ్మెల్యేలు కూడా సురక్షితంగా లేరన్న విషయాన్ని ప్రతిపక్షనేత టికారామ్ అసెంబ్లీలో ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చోరీలు, దోపిడీలు, మాఫియా కార్యకలాపాలు నిర్భయంగా సాగుతున్నాయని ఆరోపిస్తూ, పోలీసులు చేతకానివారై మౌనంగా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: గ్రూప్-1పై హైకోర్టు తీర్పు రిజర్వు.. అభ్యర్థుల్లో హైటెన్షన్!
Also Read: Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి