/rtv/media/media_files/2025/08/17/us-suspends-visas-for-gazans-seeking-medical-aid-after-far-right-campaign-2025-08-17-17-01-03.jpg)
US Suspends Visas For Gazans Seeking Medical Aid After Far-Right Campaign
హమాస్‌ను అంతం చేసే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తూనే ఉంది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి గాజా ప్రజలకు వీసాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడ్డ చాలామంది గాజా పౌరులు చికిత్స చేయించుకునేందుకు అమెరికాకు వస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ కీలక విషయాలు వెల్లడించింది. '' తాత్కాలిక వైద్య మానవతా వీసాలు జారీ చేసేందుకు ఉపయోగించే ప్రక్రియపై సమీక్ష నిర్వహిస్తున్నాం.
Also Read: పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. సైనిక పాలనలోకి పాకిస్తాన్!
ఇందులో భాగంగానే గాజా ప్రజలకు అన్ని వీసాలు నిలిపివేస్తున్నాం. గాజా నుంచి అమెరికాకు వచ్చే పాలస్తీనియన్లు హమాస్‌కు అనుకూలంగా ఉన్నారు. వాళ్లు హమాస్‌కు నిధులు సేకరించడం కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే ఈ చర్యలు తీసుకున్నాం. గతవారం 11 మంది పాలస్తీనియన్ చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లను అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ 'హీల్ పాలస్తీనా' వైద్య చికిత్స కోసం అమెరికాకు తీసుకొచ్చేందుకు సహకరించింది. పెద్దమొత్తంలో ఇలా గాజా ప్రజలను తరలించడం సరైన పని కాదని'' విదేశాంగ శాఖ పేర్కొంది.
Also Read: ఢిల్లీలో అభివృద్ధిని చూసి వాళ్లు ఓర్వలేక పోతున్నారు: ప్రధాని మోదీ
మరోవైపు గాజా పౌరులపై ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని పలు స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా ఆధారిత స్వచ్ఛంద సంస్థ 'పాలస్తీనా చిల్డ్రన్స్ రిలీఫ్ ఫండ్' కూడా దీనిపై స్పందించింది. ట్రంప్ యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. గత 30 ఏళ్ల నుంచి వేలాది మంది పాలస్తీనా చిన్నారులను మెరుగైన వైద్య చికిత్స కోసం అమెరికాకు తరలించామని పేర్కొంది. గాజాపై ఇజ్రాయెల్ నిరంతరాయంగా దాడులు చేస్తోందని.. దీని వల్ల వేలాదిమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది. చిన్నారులు చనిపోతుంటే ఇలాంటి ఆంక్షలు విధించడం ఏంటని ట్రంప్ ప్రభుత్వాన్ని నిలదీసింది.
Also Read: లెస్ రిస్క్.. మోర్ సోవింగ్.. 60 ఏళ్ల మహిళలకు బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ అంటే ఇవే!
ఇదిలాఉండగా గాజాపై ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. గాజాను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. దశలవారీగా ప్లాన్ ప్రకారం.. 5 నెలల్లో గాజాలో అనేక ప్రాంతాలు హస్తగతం చేసుకోవాలని యోచిస్తోంది. దాదాపు 10 లక్షల మంది పాలస్తీనియన్లను ఖాళీ చేయించడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు హమాస్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేసుకునేందుకు చర్యలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. మొత్తానికి గాజాపై పట్టు సాధించాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. మరోవైపు గాజాలో నెలకొన్న పరిస్థితుల వల్ల అనేకమంది తిండి లేక చనిపోతున్నారు. మృతుల్లో ఎక్కువగా చిన్నారులే ఉండటం కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు మాత్రం కనిపించడం లేదు.
Also Read: కొడుకు కాదు, వీడు కామకుక్క.. 65ఏళ్ల తల్లిపై కన్నకొడుకే అత్యాచారం