/rtv/media/media_files/2025/08/17/delhi-man-rape-2025-08-17-15-17-53.jpg)
దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 39 ఏళ్ల ఓ వ్యక్తి అతని 65 ఏళ్ల తల్లిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గతంలో అతని తల్లి చేసిన దానికి శిక్షగా ఆ కిరాతకుడు అలా చేశానని ఆమెతో చెప్పాడట. ఆమెకు ఇది వరకు ఉన్న రిలేషన్ కారణంగా "శిక్ష"గా ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితుడు పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కన్న తల్లిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో యువకుడు. గతంలో ఆమె చేసిన తప్పుకు ఇది శిక్ష అని పేర్కొంటూ ఆమెపై రెండుసార్లు లైంగికదాడి చేశాడు. సెంట్రల్ ఢిల్లీలోని హౌజ్ ఖాజీ ప్రాంతంలో బాధితురాలి కుటుంబం నివాసం ఉంటున్నది. ఆమె భర్త రిటైర్డ్ ఉద్యోగి. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, 39ఏళ్ల కొడుకు ఉన్నారు.
పెద్ద కుమార్తెకు వివాహం కాగా, ఆమె అదే పరిసరాల్లో తన భర్త, అత్తమామలతో ఫాటు ఉంటోంది. అయితే జూలై 17న బాధితురాలు, ఆమె భర్త , చిన్న కుమార్తె సౌదీ అరేబియాకు వెళ్లారు. ఈ సమయంలో నిందితుడు తన తండ్రికి ఫోన్ చేసి, వారిని వెంటనే ఢిల్లీకి తిరిగి రమ్మని కోరాడు. తల్లికి విడాకులు ఇవ్వాలని, ఆమెకు కొన్నేళ్లుగా ఇతరులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని చెప్పాడు. తరువాత కూడా కుమారుడు ఇదే తరహాలో తండ్రికి ఫోన్లు చేస్తూ వచ్చాడు. ఆగస్ట్ 1న యాత్ర ముగించుకుని వారు ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో తల్లిని ఒక గదిలోకి తీసుకెళ్లిన కుమారుడు.. ఆమెపై దాడి చేశాడు. ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డాడు.
#BREAKING Delhi India 🚨 An Abdul rapes his mother twice as punishment for her past relationships!
— Truth Vibe (@GlobeStoryHQ) August 17, 2025
Do these monsters deserve to live in society? pic.twitter.com/gzZv0GZ3fC
ఆగస్టు 11 రాత్రి 9:30 గంటలకు నిందితుడు తన తల్లితో పర్సనల్‌గా మాట్లాడాలని తన కుటుంబ సభ్యులకు చెప్పి, ఆమెను మరోసారి గదిలో బంధించాడు. ఆమె గతంలో కలిగి ఉన్న సంబంధాలకు శిక్షగా అతడు అత్యాచారం చేశాడని ఆమె తెలిపింది. ఈ ఘటన అనంతరం బాధితురాలు తన చిన్న కూతురితో కలిసి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు తన కూతురితో కలిసి హౌజ్ ఖాజీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64 (అత్యాచారం) కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఢిల్లీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ దారుణంపై స్థానికులు, మహిళా సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.
#HTExclusive
— Hemani Bhandari (@HemaniBhandari) August 17, 2025
In a horrific incident, a 39-year-old man repeatedly thrashed & raped his 65-year-old mother in central Delhi as "punishment" because he believed she was in relationships with other men when he was a child& his father was away at work.
He has been arrested. pic.twitter.com/CDH5V8aAcu