/rtv/media/media_files/2025/06/19/us-resumes-student-visas-2025-06-19-09-16-29.jpg)
US Resumes Student Visas, Social Media Vetting Of Applicants Mandatory
అమెరికాలో చదువుకోవాలనుకునేవారిక అమెరికా శుభవార్త తెలిపింది. ఇటీవల తాత్కాలికంగా ఆపేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను మళ్లీ ప్రారంభించించింది. వీసా కోసం అప్లై చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్‌ను కూడా తప్పకుండా తనిఖీ చేస్తామని పేర్కొంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. దీనికి సంబంధించి విదేశాఖ శాఖ సీనియర్ అధికారి మాట్లాడారు.
Also Read: ప్రపంచంలోనే ఉత్తమ పాఠశాలలు.. 4 భారతీయ బడులకు చోటు
'' సోషల్ మీడియా వెట్టింగ్‌తో అమెరికాలోకి వచ్చేందుకు యత్నించే ప్రతివ్యక్తిని పూర్తిగా పరిశీలించే వీలు కలుగుతుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే స్టూడెంట్స్ సోషల్ మీడియా ఖాతాలను అమెరికా కాన్సులర్ అధికారులు తనిఖీ చేస్తారు. దీనికోసం విద్యార్థులు తమ సోషల్ మీడియా ప్రొపైళ్ల ప్రైవేటు సెట్టింగ్స్‌ను మార్చుకోవాలి. పబ్లిక్ ఆప్షన్‌ను పెట్టుకోవాలని'' ఆ విదేశాంగ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.
Also Read: ఇజ్రాయెల్‌కు సాయం చేయొద్దు.. అమెరికాకు పుతిన్ వార్నింగ్..
Also Read : అమెరికాలో చదువుకోవాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. మళ్లీ వీసాలు షురూ
ఏంటీ సోషల్ మీడియా వెట్టింగ్
వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి పర్మిషన్ ఇవ్వొచ్చా ? లేదా అనే దాన్ని అంచనా వేసేందుకు వాళ్ల ఆన్‌లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేస్తారు. దీనినే సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు. దీనిప్రకారం విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసాలు జారీ చేస్తారు. ఉదాహరణకు ఏదైనా విద్యార్థి తన సోషల్ మీడియా ఖాతాలో పాలస్తీనా జెండాను పోస్ట్ చేస్తే అతడిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వారివల్ల దేశ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని నిర్ధరించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు.
Also read: బీటెక్ చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
telugu-news | usa | us visa telugu | international news in telugu | latest-telugu-news | today-news-in-telugu
Follow Us