Trump: భారత్‌పై భారీగా టారిఫ్‌లు పెంచుతా .. ట్రంప్ సంచలన ప్రకటన

భారత్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్‌ పెద్దమొత్తంలో చమురు కొనుగోళ్లు చేస్తోందని ఆరోపించారు. అందుకే భారత్‌పై మరోసారి భారీగా టారిఫ్‌లు పెంచుతానని హెచ్చరించారు.

New Update

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే భారత్‌పై 25 శాతం సుంకం, పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా భారత్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్‌ పెద్దమొత్తంలో చమురు కొనుగోళ్లు చేస్తోందని ఆరోపించారు. కొనుగోలు చేయడమే కాకుండా.. ఆ ఇంధనాన్ని బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తూ లాభాలు పొందుతోందని విమర్శించారు. రష్యా చేస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్‌లో అమాయకులు ప్రాణాలు పోతున్నా వారికి పట్టడం లేదంటూ మండిపడ్డారు. అందుకే భారత్‌పై మరోసారి భారీగా టారిఫ్‌లు పెంచుతానని హెచ్చరించారు. ఎంతశాతం అన్నది మాత్రం స్పష్టం చేయలేదు. ఈ విషయాన్ని ఆయన తన సామాజిక మాధ్యమం ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్ చేశారు . 

Also read: ఉద్యోగస్తులకు బిగ్ షాక్.. ఏజెంటిక్‌ ఏఐతో ఈ రంగాల వారి జాబ్‌లు ఔట్.. 1.8 కోట్ల ఉద్యోగాలు గల్లంతు!

Also Read: ఇంటిని కూల్ చేసే పెయింట్.. ఇది ఉంటే అసలు ఏసీ అక్కర్లేదు

ఇదిలాఉండగా.. ట్రంప్‌ బెదిరింపులకు లొంగే ప్రస్తక్తే లేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపేసే అవకాశం లేదని తేల్చిచెప్పాయి. భారత చమురు కొనుగోళ్లు అనేవి జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉంటాయని పేర్కొన్నాయి. భారత్‌ను ఏదో విధంగా దారికి తెచ్చుకోవాలని ట్రంప్‌ వ్యూహమని చెబుతున్నాయి. అందుకే పాక్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకుని భారత్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారంటూ పేర్కొన్నాయి. అయితే ట్రంప్‌ తాజాగా మరోసారి టారీఫ్‌లు పెంచుతామని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రంప్‌ ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు . 

Also read:  నిమిషా ప్రియా కేసులో బిగ్‌ట్విస్ట్.. ఉరిశిక్ష అమలుచేయాలని డిమాండ్

Also Read: టీసీఎస్ ఉద్యోగి దీనపరిస్థితి.. ఆఫీస్ ముందే మూడు రోజులు! వైరలవుతున్న లెటర్

#national #trump #international
Advertisment
తాజా కథనాలు