Another War: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు..అమెరికా అండతో..

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకున్నాయి. అమెరికాతో కలిసి సౌత్ కొరియా సైనిక విన్యాసాలు చేయడంతో  రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ నెల 18న మొదలైన ఈ సైనిక విన్యాసాలు 11 రోజుల పాటూ కొనసాగనున్నాయి. 

New Update
south-north

South Korea-North Korea

అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్(kim jong un) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెచ్చగొట్టే చర్చ అని మండిపడ్డారు. అణ్వాయుధాలను మరింత పెంచుతానని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఉత్తర కొరియా నుంచి వచ్చే ముప్పు ఎదుర్కునే భాగంలో అమెరికా, దక్షిణ కొరియా బలగాలు వార్షిక విన్యాసాలను ప్రారంభించాయి. ఆగస్టు 18న ఇవి మొదలయ్యాయి. 11 రోజుల పాటూ కొనసాగనున్నాయి. సియోల్ కు చెందిన 18వేల మందితో పాటూ మొత్తం 21 వేల మంది సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నారు. ఇందులో ఆయుధ పరీక్షలను కూడా నిర్వహిస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఉత్తర కొరియా అణ్వాయుధాలను భారీగా సమకూర్చుకుంటోంది. తాజాగా అణ్వాయుధ సామర్థ్యం కలిగిన చో హ్యోన్ యుద్ధ నౌక అధ్యక్షుడు కిమ్ పరిశీలించారు.   శత్రువులు యుద్ధాన్ని ప్రేరేపించే చర్యలు చేస్తున్నారని...వాటికి ధీటుగా సమాధానమిస్తామని కిమ్ అన్నారు. అలాగే తమ అణ్వాయుధ సంపత్తిని మరింత పెంచుకుంటామని చెప్పారు. 

Also Read :  యుద్ధానికి ఆజ్యం పోస్తూ లాభాలు సాధిస్తోంది.. భారత్ పై సుంకాలు తప్పువు.. ట్రంప్ సలహాదారు

రెండు దేశాల మధ్యా వైరం ఎందుకు?

1945లో నార్త్​ కొరియా(north-korea), సౌత్​ కొరియా(south-korea)లు విడిపోయాయి. రెండింటికి వేరువేరు ప్రభుత్వాలు వచ్చాయి. అయితే  రెండు దేశాలు తమను తాము కొరియాకు ఏకైక చట్టబద్ధమైన ప్రభుత్వంగా చెప్పుకుంటున్నాయి. రెండు దేశాలకు మధ్య గొడవలకు ఇదే మూల కారణం. దాంతో పాటూ 1950-- 53 మధ్య జరిగిన కొరియా యుద్ధంలో ఉత్తర కొరియా సోవియట్ మద్దతుతో దక్షిణ కొరియాపై దాడి చేసింది. మూడు ఏళ్ళ పాటూ ఇది జరిగింది. చాలా మంది చనిపోయారు. తరువాత కాల్పుల విరమణ జరిగినప్పటికీ..రెండు దేశాల మధ్యనా శాంతి ఒప్పందం మాత్రం కుదరలేదు. అప్పటి నుంచి వారి మధ్య శత్రుత్వం అలానే ఉండిపోయింది.  

ఉత్తర కొరియా అణు కార్యక్రమం, క్షిపణి పరీక్షలు దక్షిణ కొరియాతోపాటు ఇతర దేశాలకు వివాదాలకు ప్రధాన కారణం. ఉత్తర కొరియాలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని.. దక్షిణ కొరియాతో పాటు ఇతర దేశాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా నిర్వహించే సైనిక విన్యాసాలు కూడా ఉత్తర కొరియాతో ఉద్రిక్తతలకు దారితీస్తాయి. ఉత్తర కొరియాపై విధించిన అంతర్జాతీయ ఆంక్షలు కూడా ఆర్థిక, రాజకీయ వివాదాలకు కారణమవుతున్నాయి. 

ఉత్తర కొరియా తరచుగా స్వల్ప శ్రేణి క్షిపణులను ప్రయోగిస్తోంది. ఇది దక్షిణ కొరియా, ఇతర దేశాలలో ఆందోళనలను కలిగిస్తుంది. అధికారిక వర్గాల ప్రకారం.. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య శాంతి చర్చలు చాలా కాలంగా స్తంభించిపోయాయి. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాను ప్రధాన శత్రువుగా పేర్కొంది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలలో మరింత క్షీణతకు దారితీస్తుంది.

Also Read: USA Visa: అమెరికాలో విదేశీ ట్రక్ డ్రైవర్లకు నో వీసా...ఇండియన్స్ పై భారీ ఎఫెక్ట్

Advertisment
తాజా కథనాలు