Anushka Shetty : ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. నా ఫస్ట్ లవ్ అతడితోనే: అనుష్క ఓపెన్

అనుష్క శెట్టి తన మొదటి ప్రేమ గురించి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె ఆరవ తరగతి చదువుతున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి "ఐ లవ్ యూ" అని ప్రపోజ్  చెప్పాడట. ఆ వయసులో తనకు ప్రేమ అంటే ఏమిటో తనకు తెలియకపోయినా, అతనికి ఓకే అని చెప్పేశానంది.

New Update
anushka-prabhas

హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్క శెట్టి ఇద్దరు ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గతంలో చాలా వార్తలు వచ్చాయి. బిల్లా  సినిమా నుంచే ప్రభాస్, అనుష్కల మధ్య ప్రేమాయణం నడుస్తోందని, వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని చాలా సంవత్సరాలుగా పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. బాహుబలి చిత్రం తర్వాత ఈ పుకార్లు మరింత పెరిగాయి. అభిమానులు కూడా వారు నిజంగానే ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకుంటారని ఆశించారు. అయితే, ప్రభాస్, అనుష్క పలు సందర్భాల్లో తాము మంచి స్నేహితులం మాత్రమే అని, తమ మధ్య ఎలాంటి ప్రేమ బంధం లేదని స్పష్టం చేశారు. తమ పెళ్లి వార్తలను నవ్వుతూ కొట్టిపారేశారు.  ఏజ్ 40 దాటినా వీరిద్దరూ పెళ్లి చేసుకోకపోవడంతో రకకరాల ఊహాగానాలు వచ్చాయి. 

మొదటి ప్రేమ గురించి

ప్రభాస్ పెళ్లి పక్కన పెడితే అనుష్క శెట్టి తన మొదటి ప్రేమ గురించి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె ఆరవ తరగతి చదువుతున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి "ఐ లవ్ యూ" అని ప్రపోజ్  చెప్పాడట. ఆ వయసులో తనకు ప్రేమ అంటే ఏమిటో తనకు తెలియకపోయినా, అతనికి ఓకే అని చెప్పేశానని, అది తనకు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిందని ఆమె తెలిపారు. అలాగే ఆమె 2008లో ఒక వ్యక్తిని ప్రేమించానని, అది తీయని ప్రేమ అని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోయామని కూడా ఒక ఇంటర్వ్యూలో అనుష్క  వెల్లడించారు. ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం ఆమె చెప్పలేదు. 

కాగా అనుష్క  ప్రస్తుతం ఘాటి చిత్రంలో నటిస్తున్నారు.  క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను  రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి (ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్), యూవీ క్రియేషన్స్ సమర్పణలో రూపొందిస్తున్నారు.  బాధితురాలి నుండి నేరస్తురాలిగా, ఆపై ఒక లెజెండ్ గా మారిన ఒక గిరిజన మహిళ కథగా రూపొందుతుంది.  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో  రిలీజ్ చేయనున్నారు.  మొదట ఏప్రిల్ 18, 2025న విడుదల కావాల్సింది, కానీ జూలై 11కి వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. ఇక ఖైదీ 2లో  అనుష్క ఒక నెగిటివ్ టచ్ ఉన్న పాత్రను పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు