US-China: అమెరికా టారిఫ్‌లపై బిగ్‌ ట్విస్ట్‌.. చైనాతో సంప్రదింపులు

అమెరికా, చైనా టారిఫ్‌ల వార్‌లో బిగ్‌ ట్విస్ట్ చేసుకుంది. టారిఫ్‌ల అంశంపై చర్యలు జరిపేందుకు అమెరికా ముందుకొచ్చింది. చైనా అధికారులను అమెరికా అధికారుల బృందం సంప్రదించింది. ఈ విషయాన్ని బీజింగ్‌కు చెందిన ఓ మీడియా తెలిపింది.

New Update
Xi Jinping and Trump

Xi Jinping and Trump

అమెరికా విధించిన టారిఫ్‌లు ఇటీవల సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికా, చైనా మధ్య ఈ టారిఫ్‌ల వార్‌ గట్టిగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్‌ ట్విస్ట్ చేసుకుంది. టారిఫ్‌ల అంశంపై చర్యలు జరిపేందుకు అమెరికా ముందుకొచ్చింది. చైనా అధికారులను అమెరికా అధికారుల బృందం సంప్రదించింది. ఈ విషయాన్ని బీజింగ్‌కు చెందిన ఓ మీడియా తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.  

Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం

ఇదిలాఉండగా ట్రంప్‌ ప్రభుత్వం చైనా వస్తువులపై ఏప్రిల్‌ 145 శాతం సుంకాలు విధించింది. చైనా కూడా అమెరికా వస్తువులపై 125 శాతం సుంకాలు విధించింది. దీనిపై గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే అమెరికా అధికారులు పలు మార్గాల్లో చైనా అధికారులను సంప్రదించినట్లు ఓ వార్త సంస్థ తెలిపింది. అమెరికానే చైనాతో సంప్రదింపుల కోసం చూస్తోందని తెలిపింది. అయితే దీనికి సంబంధించి చైనా విదేశాంగ శాఖ నుంచి మాత్రం అధికారక ప్రకటన రాలేదు. 

Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!

ఇదిలాఉండగా.. చైనానే టారిఫ్‌లపై చర్చలు చేసేందుకు యత్నిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నారు. చైనాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. చర్చల్లో మా రూల్స్‌కు కట్టుబడే ఒప్పందం చేసుకోనున్నామని తెలిపారు. ఇదిలాఉండగా ఇటీవల అమెరికా అనేక దేశాలపై భారీగా టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. 

Also Read: ఇండియా, పాక్ సరిహద్దులు క్లోజ్.. ఈరోజుతో రాకపోకలు బంద్

Also Read: నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. బిగ్ షాకిచ్చిన ఆర్టీసీ!

telugu-news | trump | big-tariff-hike | donald trump tariffs | china 

Advertisment
Advertisment
తాజా కథనాలు