INDIA PAK WAR: ఇండియా, పాక్ సరిహద్దులు క్లోజ్.. ఈరోజుతో రాకపోకలు బంద్

భారత ప్రభుత్వం 30 నుంచి సరిహద్దు మూసినట్లు ప్రకటించింది. పాకిస్తాన్ గురువారం ఉదయం నుంచి వాఘా సరిహద్దును తెరవలేదు. అలాగే కరాచీ, లాహోర్ నుంచి విమాన ప్రయాణాలు గురువారం(ఈరోజు) ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మూసివేయబడింది.

New Update
Attari Wagah border close

పహల్గామ్ ఉగ్రదాడితో పాక్, భారత్ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇండియాలో ఉన్న పాక్ పౌరులు తమ దేశానికి వెళ్లాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రభుత్వం 30 నుంచి సరిహద్దు మూసినట్లు ప్రకటించింది. పాకిస్తాన్ గురువారం ఉదయం నుంచి వాఘా సరిహద్దును తెరవలేదు. అలాగే కరాచీ, లాహోర్ నుంచి విమాన ప్రయాణాలు గురువారం(ఈరోజు) ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మూసివేయబడింది.

వారం రోజుల పాటు ఇరువైపుల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చిన నేపథ్యంలో  రెండు దేశాల మధ్య ఉన్న అట్టారి, -వాఘా సరిహద్దు క్రాసింగ్ పాయింట్‌ను గురువారం పూర్తిగా మూసివేశారు.  మే1న (గురువారం) ఇరు దేశాల వారు ఒక్కరు కూడా సరిహద్దు దాటలేదని ఇరు దేశాల వర్గాలు నిర్ధారించాయి. బుధవారం అట్టారి-వాఘా సరిహద్దు నుంచి మొత్తం 125 మంది పాకిస్తానీ పౌరులు భారతదేశం నుండి బయలుదేరారు. దీంతో గత ఏడు రోజుల్లో దేశం విడిచి వెళ్ళిన మొత్తం పాకిస్తానీల సంఖ్య 911కి చేరుకుంది.

పాకిస్తాన్ వీసా ఉన్న పదిహేను మంది భారతీయ పౌరులు కూడా బుధవారం పాకిస్తాన్‌కు చేరుకున్నారు. పాకిస్తాన్ వెళ్లిన భారతీయుల సంఖ్య 23కి చేరుకుంది. అదేవిధంగా, పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు క్రాసింగ్ పాయింట్ ద్వారా 152 మంది భారతీయులు, 73 మంది పాకిస్తానీలు భారతదేశంలోకి ప్రవేశించారు. దీంతో మొత్తం వ్యక్తుల సంఖ్య వరుసగా 1,617 మరియు 224కి చేరుకుంది.

Advertisment
తాజా కథనాలు