Trump: విదేశీ విద్యార్థులకు షాక్.. ట్రంప్‌ సంచలన నిర్ణయం

ట్రంప్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులే లక్ష్యంగా.. తాజాగా మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీనిప్రకారం ఏ విద్యార్థి వీసా అయిన ఏదైన కారణం చేత రద్దయిన వెంటనే అమెరికా నుంచి బహిష్కరించవచ్చు.

New Update
U.S. Government’s new policy terminates international students’ legal status

U.S. Government’s new policy terminates international students’ legal status

డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారులను అరికట్టేందుకు ట్రంప్ సర్కార్‌ వ్యూహాలు రచిస్తోంది. భారత్‌తో పాటు అంతర్జాతీయ విద్యార్థులే లక్ష్యంగా విస్తృత చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే అమెరికా నుంచి వాళ్లను త్వరగా పంపించేందుకు మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇంతకుముందు ఒక విద్యార్థి వీసా రద్దు అయినప్పటికీ కూడా అమెరికాలో చదువు పూర్తి చేసేందుకు.. అక్కడ ఉండేందుకు పర్మిషన్ ఇచ్చేవారు.

Also Read: లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పాకిస్తాన్ ఆర్మీ కవాతు.. పాక్‌లో పరిస్థితి ఇదే..!

కానీ ఇప్పుడు ట్రంప్‌ సర్కార్‌ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీనిప్రకారం విద్యార్థి వీసా రద్దయిన వెంటనే అమెరికా నుంచి బహిష్కరించవచ్చు. తక్కువ వ్యవధిలో వీసాలు రద్దయిన కొందరు స్టూడెంట్స్‌ ఇటీవల అమెరికాలోని కోర్టుల్లో పిటిషన్లు వేశారు. ఈ కేసులపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్‌ సర్కార్‌ కొత్త విధానం రూపొందించింది. ఓ విద్యార్థి వీసాను ఏదైన కారణం చేత రద్దు చేస్తే.. అమెరికాలో చదువుకునే అవకాశాన్ని, అలాగే ఉద్యోగం చేసే హక్కును కోల్పోతారు. 

Also Read: అమెరికా రక్షణ మంత్రితో ఫోన్‌లో మాట్లాడిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

అంతేకాదు స్టూడెంట్స్ ఏ తప్పు చేయనప్పటికీ కూడా వాళ్లని నేరస్తులుగానే పరిగణిస్తారు. ఆఖరికీ క్రిమినల్‌ డేటాలో సైతం వాళ్ల పేర్లు ఉంచుతారు. ఈ విధంగా విద్యార్థులకు చట్టపరమైన హోదా రద్దు చేస్తారు. తద్వారా దేశం నుంచి పంపంచివేస్తారు. అయితే ఈ కొత్త రూల్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను త్వరోనే జారీ చేస్తామని ట్రంప్‌ సర్కార్‌ కోర్టుకు వివరించింది.

Also Read: భారత్‌ని దెబ్బతీసేందుకు పాకిస్తాన్ కొత్త ప్లాన్.. మయన్మార్, బంగ్లాదేశాల్లో కుట్ర..!

Also Read: పాక్‌కు మరో BIG షాక్: 1971లో ఇందిరమ్మ చేసింది.. ఇప్పుడు మోదీ చేయబోతున్నారా..?

telugu-news | rtv-news | trump | usa | Immigrants 

Advertisment
Advertisment