పాక్‌కు మరో BIG షాక్: 1971లో ఇందిరమ్మ చేసింది.. ఇప్పుడు మోదీ చేయబోతున్నారా..?

ఇండియా నుంచి పాకిస్తాన్‌కు పోస్టల్, పార్శిల్ సర్వీసులు నిలిపివేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. అలాగే పాకిస్తాన్ షిప్పులు మన ఓడరేవుల్లో ప్రవేశాన్ని నిషేధించనున్నట్లు సమాచారం. పాకిస్తాన్‌తో 1971 యుద్ధం సమయంలో అప్పటి PM ఇందిరా గాంధీ అదే నిర్ణయం తీసుకున్నారు.

New Update
PM modi 123

పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత భారత్‌ పాకిస్తాన్‌కు వరుస షాక్‌లు ఇస్తూ వస్తోంది. మొదట దౌత్య సంబంధాలు తెంచుకోవడం, తర్వాత సింధూ నది జలాల ఒప్పందం రద్దు. పాకిస్తాన్‌తో అన్నీ వాణిజ్య సంబంధాలు తెంచుకుంటోంది. ఉగ్రవాదాన్ని ఇండియాపై ఉసిగొలిపే పాక్‌ పని ఖతం చేయాలని భారత్ గట్టిగా నిర్ణయించుకుంది. భారత్ నిర్ణయాలు అక్కడి ప్రజలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్నాయి. పాకిస్తాన్‌ను దెబ్బ కొట్టేందుకు భారత్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 1971లో పాకిస్తాన్‌తో భారత్‌కు యుద్ధం వచ్చినప్పుడు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఇదే పని చేశారు. అది పాకిస్తాన్‌కు ఇబ్బందిగా మారింది. ఇంతకీ ఇందిరా గాంధీ 1971లో తీసుకున్న నిర్ణయం, ఇప్పుడు మోదీ తీసుకోబోతున్న నిర్ణయం ఏంటంటే..

పాకిస్తాన్‌కి షిప్పింగ్ లైన్లు, పోస్టల్ సర్వీస్ నిలిపివేయాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తోంది. త్వరలోనే ఇది అధికారికంగా ప్రకటించవచ్చు. ఇప్పటికే పాక్ విమానాలు మన దేశ గగనతలంలోకి రావడాన్ని నిషేధించిన కేంద్రం. ఇండియా నుంచి పాకిస్తాన్‌కు పోస్టల్ సర్వీసులు కూడా ఆపేయాలని అనుకుంటుంది. ఇలా చేస్తే పాకిస్తాన్‌లో గందరగోళం అవ్వచ్చు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత్ పోస్టల్ సేవలను పాకిస్తాన్ సద్వినియోగం చేసుకుంటోంది. పోస్టల్ సేవలు ఆగిపోతే.. ఇరు దేశాల మధ్య చలామణి అయ్యే ఉత్తరాలు, పార్శిళ్లు, మందులు, పత్రాలు అన్నీ ఆగిపోతాయి. దీంతో పాక్ వ్యాపారవేత్తలు, సామాన్యులకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే వీసా సమస్యల కారణంగా చాలా మంది భారతదేశంలో నివసిస్తున్న వారి బంధువులతో ఉత్తరాల్లో సంప్రదింపులు జరుపుతున్నారు. వాటితో ఇండియాలో బిజినెస్ చేస్తున్నారు.

పాకిస్తాన్‌ షిప్పులను భారత్ పోర్టుల్లో నిషేదిస్తే.. సముద్ర మార్గాలో రవాణా చేసే వస్తువులపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష సముద్ర వాణిజ్యం పరిమితం అయినప్పటికీ.. 3 దేశాల వస్తువులు కూడా ప్రభావిత మవుతాయి. పాకిస్తాన్ నుంచి వెళ్ళే కంటైనర్లు ఉపయోగించే ముంద్రా, నవా షెవా వంటి భారతీయ ఓడరేవులను మూసివేయవచ్చు. సముద్ర మార్గాన పాకిస్తాన్ భారత్ నుంచి మందులు, రసాయనాలు, వస్త్రాలు వంటి అనేక ముఖ్యమైన ఉత్పత్తులను పొందేది. సముద్ర మార్గాన్ని మూసేస్తే ఇప్పుడు వాటిని పొందలేరు. పాకిస్తాన్‌ని దాటి చాబహార్ పోర్టుతో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మధ్య వాణిజ్యాన్ని భారతదేశం పెంచితే, పాకిస్తాన్ భౌగోళిక రాజకీయ ప్రాముఖ్యత కూడా తగ్గుతుంది.

గతంలో పోస్టల్ సేవలు బంద్
1947-1965: విభజన తర్వాత కూడా పోస్టల్ సేవలు పరిమిత స్థాయిలో కొనసాగాయి.
1965 ఇండోపాక్ యుద్ధ సమయంలో
1971యుద్ధంలో ఇందిరా గాంధీ నిషేధం విధించారు. కానీ 1974లో దానిని తిరిగి పునరుద్ధరించారు.
ఇందిరా గాంధీ ప్రభుత్వ హయాంలోనే పోస్టల్, రైలు, బస్సు సర్వీసులు మరియు ప్రజల రాకపోకలు ప్రారంభమయ్యాయి.
ఇదే సమయంలో 2 దేశాల మధ్య పోస్టల్, పార్శిల్ సర్వీసులు అధికారికంగా తిరిగి మొదలైయ్యాయి.

(pakistan | india pak war | india pak war news | postal service | pahalgam | Pahalgam attack | militant attack pahalgam | shipyards | arabia-sea)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు