Chicago: ఇల్లినాయిస్ లో నేషనల్ గార్డ్స్..వదిలిపెట్టేది లేదంటున్న ట్రంప్

ప్రస్తుతం అమెరికాలో ఇల్లినాయిస్ , అధ్యక్షుడు ట్రంప్ ల మధ్య యుద్ధం నడుస్తోంది. ఇల్లినాయిస్ గవర్నమెంట్ ఎంత ప్రయత్నించినప్పటికీ...ట్రంప్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. అక్కడ 300 మంది నేషనల్ గార్డ్స్ ను డిప్లాయ్ చేశారు. 

New Update
illinois

తమ రాష్ట్రంలో నేషనల్ గార్డ్స్(National Guards) ను మోహరించకుండా ఉండడానికి ఇల్లినాయిస్ గవర్నమెంట్ చాలా ప్రయత్నించింది. కోర్టులో దావా కూడా వేసింది. కానీ ఫెడరల్ కోర్టులో ఈ కేసు నెగ్గకపోవడంతో ఇల్లినాయిస్ కు నేషనల్ గార్ట్స్ చేరుకున్నారు. దాదాపు 400 మంది కేంద్రబలగాలు మొత్తం రాష్ట్రాన్ని చుట్టుముట్టాయి. ముఖ్యంగా షికాగో నగరంలో వీరిని మోహరించింది ట్రంప్ ప్రభుత్వం(Trump Government). అయితే దీన్ని ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ఫ్రిట్జికర్ దీనిని వ్యతిరేకించారు. తాముదీనిపై ఇంకా పోరాటం చేస్తామని తెలిపారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన దండయాత్ర అని ఆయన అభివర్ణిచారు. ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దావా వేసింది అక్కడి గవర్నమెంట్. 

Also Read :  Trump Tariffs: మళ్ళీ టారిఫ్ బాంబు పేల్చిన ట్రంప్.. వాటిపై 25% సుంకాలు!

నేరాలు చాలా ఎక్కువ..

అయితే ట్రంప్, ఆయన యంత్రాంగం మాత్రం షికాగోతో పాటూ ఇల్లినాయిస్ రాష్ట్రం ప్రమాదంలో ఉందని ఆరోపిస్తున్నారు. అక్కడ ఆర్థిక నేరాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. అందుకే అక్కడ నేషనల్ గార్డ్స్ ను డిప్లాయ్ చేస్తున్నామని అన్నారు. ప్రజా భద్రత ప్రమాదంలో ఉందని తాను విశ్వసిస్తే దళాలను పంపవచ్చని ట్రంప్ అంటున్నారు. 

టెక్సాస్, పోర్ట్ ల్యాండ్ లలో కూడా..

అయితే ఇల్లానాయిస్ కు ఒక్కదానికే కాక... దాంతో పాటూ టెక్సాస్, సోర్ట్ ల్యాండ్ రాష్ట్రాలకు కూడా నేషనల్ గార్డ్స్ ను పంపించారు ట్రంప్. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్రాట్ అధ్యక్షుడి ఆదేశాల మేరకు 400 మంది నేషనల్ గార్డ్స్ ను అక్కడ మోహరించారు. మరోవైపు పోర్ట్ ల్యాండ్ కు ట్రంప్ ప్రభుత్వం నేషనల్ గార్డ్స్ పంపడానికి ట్రంప్ యంత్రాంగం ప్రయత్నించింది. దీనిని అక్కడి కోర్టు అడ్డుకట్ట వేసింది. నేషనల్ గార్డ్స్ రావడానికి వీలు లేదంటూ తీర్పు చెప్పింది. 

Also Read: Vijay Devarakonda: అయ్యో మొన్న నిశ్చితార్థం..ఈరోజు యాక్సిడెంట్..నేను సేఫ్ అటున్న రౌడీ హీరో

Advertisment
తాజా కథనాలు