అమెరికాలో హనుమంతుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ట్రంప్ పార్టీ నాయకుడే!

అమెరికా టెక్సాస్‌లో ఉన్న 90 అడుగుల హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ పార్టీ నేత అలెగ్జాండర్ డంకన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. 'స్టాట్యూ ఆఫ్ యూనియన్' అని పిలువబడే ఈ విగ్రహంపై ఆయన చేసిన వ్యాఖ్యలను హిందూ అమెరికన్ ఫౌండేషన్ తీవ్రంగా ఖండించింది.

New Update
Republican Leader Remark On Hanuman Statue

అమెరికా టెక్సాస్‌లో ఉన్న 90 అడుగుల హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ పార్టీ నేత అలెగ్జాండర్ డంకన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. 'స్టాట్యూ ఆఫ్ యూనియన్' అని పిలువబడే ఈ విగ్రహంపై ఆయన చేసిన వ్యాఖ్యలను హిందూ అమెరికన్ ఫౌండేషన్ తీవ్రంగా ఖండించింది. అమెరికాలో హిందూ మతానికి వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగాలు పెరుగుతున్న నేపథ్యంలో డంకన్ వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగించాయి.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్సాస్ సెనేట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న డంకన్, హనుమాన్ విగ్రహానికి సంబంధించి ఓ వీడియో Xలో పోస్ట్ చేశాడు. అందులో ఆయన ఇలా రాసుకొచ్చారు. "మనం ఒక క్రైస్తవ దేశం అయినప్పుడు, ఇక్కడ ఓ అబద్ధపు హిందూ దేవుడి విగ్రహాన్ని ఎందుకు అనుమతిస్తున్నాము?" అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి.

డంకన్ వ్యాఖ్యలపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ వెంటనే స్పందించింది. ఆ సంస్థ టెక్సాస్ రిపబ్లికన్ పార్టీని ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది. "అసలు విచక్షణకు వ్యతిరేకంగా, హిందువుల పట్ల ద్వేషాన్ని ప్రదర్శిస్తున్న మీ పార్టీ సెనేట్ అభ్యర్థిని మీరు క్రమశిక్షణతో వ్యవహరించేలా చేస్తారా?" అని ప్రశ్నించింది. అమెరికా రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛను కూడా డంకన్ అవమానించారని ఆ సంస్థ పేర్కొంది.

సామాజిక మాధ్యమాల్లో డన్‌కన్‌కు వ్యతిరేకంగా అనేకమంది నెటిజన్లు స్పందించారు. అమెరికా రాజ్యాంగం మత స్వేచ్ఛకు హామీ ఇస్తుందని, ఒకరి నమ్మకాలను 'అబద్ధం' అని చెప్పడం సరైంది కాదని గుర్తు చేశారు. "మీరు హిందువు కానంత మాత్రాన, ఆ నమ్మకాలు అబద్ధం కావు. వేదాలు క్రీస్తు జన్మించడానికి 2000 సంవత్సరాల ముందే రచించబడ్డాయి. మీ మతంపై ప్రభావం చూపిన ఓ మతాన్ని గౌరవించడం మంచిది" అని నెటిజన్లు పేర్కొన్నారు. ఈ వివాదం అమెరికాలో హిందూ వ్యతిరేక భావనలను, మతపరమైన అసహనాన్ని మరోసారి చర్చకు తీసుకొచ్చింది.

Advertisment
తాజా కథనాలు