Constable Jobs: నిరుద్యోగులకు దసరా కానుక.. 7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలివే!

దసరా పండగ వేళా కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. SSC (స్టాఫ్ సెలక్షన్ కమిషన్)..  ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏకంగా  7,565 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది.

New Update
ssc delhi constable 2025 notification

ssc delhi constable 2025 notification

దసరా(Dasara 2025) పండగ వేళ కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. SSC (స్టాఫ్ సెలక్షన్ కమిషన్)..  ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టు(Constable Jobs 2025) ల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏకంగా  7,565 పోస్టులతో నోటిఫికేషన్(ssc police recruitment 2025) జారీ చేసింది. పురుషులు, మహిళా అభ్యర్థులు కలిపి మొత్తం 7, 565 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ లో మాజీ సైనికులకు కూడా అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా వారి కోసం కొన్ని రిజర్వ్‌డ్ పోస్టులను కేటాయించారు. సెప్టెంబర్ 22 నుంచి దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మొదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. నోటిఫికేషన్ కి సంబంధించిన పురః వివరాలు ఇక్కడ తెలుసుకోండి.. 

Also Read :  Microsoft: ఉద్యోగులకు Microsoft బిగ్ షాక్.. అలా చేస్తే మీ ఉద్యోగం ఔట్!

నోటిఫికేషన్ తేదీలు 

  • అప్లికేషన్ ప్రారంభ తేదీ:  సెప్టెంబర్ 22, 2025
  • ఆన్లైన్ దరఖాస్తు గడువు: సెప్టెంబర్ 22 నుంచి  2025 అక్టోబర్ 21 వరకు 
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ:  2025  అక్టోబర్ 22 (రాత్రి 11 గంటల వరకు)
  • దరఖాస్తు సవరణకు గడువు: అక్టోబర్ 29 నుంచి అక్టోబర్ 31, 2025 వరకు
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష: డిసెంబర్ 2025  లేదా  జనవరి 2026

అర్హత 

  • 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అర్హులు. అలాగే  ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష  (CBE) ద్వారా  అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.  ఆ తర్వాత శారీరక సామర్థ్యం,  కొలత పరీక్ష  (PE & MT) కూడా నిర్వహిస్తారు. 

పోస్టులు 

  • కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు: 4,408
  • కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) మహిళలు: 2,496
  • కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు [మాజీ సైనికులు (కమాండో)]: 376
  • కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు [మాజీసైనికులు (ఇతరులు)]: 285
  • మొత్తం పోస్టులు : 7,565

దరఖాస్తు విధానం

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ని సందర్శించండి.
  • ఆ తర్వాత  ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • లింక్ ఓపెన్ చేసిన తర్వాత  సరైన ఇమెయిల్ ఐడి,  మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోవాలి.
  • అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. 
  • చివరిగా దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించి, మీ అప్లికేషన్  ఫార్మ్ ను సబ్మిట్ చేయండి.

దరఖాస్తు ఫీజు వివరాలు

  • జనరల్ కేటగిరీ అభ్యర్థులకు: రూ. 100
  • మహిళా అభ్యర్థులు, SC, ST, మాజీ సైనికులకు ఫీజు లేదు.
  • ఫీజును UPI, నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు.

Also Read:  గ్రూప్-1పై TGPSC సంచలన నిర్ణయం.. డివిజన్ బెంచ్ లో పిటిషన్!

Advertisment
తాజా కథనాలు