Samantha: అతడితో సమంత ఫొటో.. మూవీపై మదర్ వీడియో వైరల్..!

సమంత నిర్మాతగా విడుదలైన తొలి సినిమా 'శుభం' పై ఆమె తల్లి నినెట్‌ రూత్ ప్రభు స్పందించారు. సామ్ యాక్టింగ్ చాలా బాగుందని, సినిమా చూసినంత సేపు కడుపుబ్బా నవ్వుకున్నానని ప్రశంసించారు. ఈ వీడియోను సమంత తన ఇన్ స్టా గ్రామ్ లో పంచుకున్నారు.

New Update

Samantha: స్టార్ సమంత హీరోయిన్ సమంత నిర్మాతగా తన మొదటి విజయాన్ని అందుకున్నారు. తన సొంత బ్యానర్ ట్రాలాల ప్రొడక్షన్ లో నిర్మించిన తొలి చిత్రం 'శుభం' సూపర్ హిట్ అయ్యింది. ఎటువంటి అంచనాలు లేకుండా మే 9న విడుదలైన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ కొనసాగిస్తోంది. కొత్త తారాగణం, కొత్త కాన్సెప్ట్ తో సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా ఈమూవీ పై సామ్ మదర్ నినెట్‌ రూత్ ప్రభు స్పందించారు. 

సామ్ మదర్ వీడియో 

సినిమా చాలా బాగుందని చిత్రబృందాన్ని ప్రశంసించారు. అలాగే సామ్ యాక్టింగ్ చాలా బాగుందని, అలా హావభావాలు పలికించడం చాలా కష్టం. సినిమా చూసినంత సేపు కడుపుబ్బా నవ్వుకున్నాను అంటూ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను సామ్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే ఈ వీడియోతో సామ్ తన టీమ్ తో కలిసి ఉన్న ఫొటోలను, థియేటర్లో ఆడియన్స్ రెస్పాన్స్ కి సంబంధించిన విజువల్స్ పంచుకున్నారు.  అందులో డైరెక్టర్ రాజ్ నిడిమోర్ తో కలిసి దిగిన ఫొటోను కూడా షేర్ చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. 

గత కొద్దిరోజులుగా రాజ్- సమంత డేటింగ్ లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  వీరిద్దరూ తరచూ ఒకే చోట కలిసి కనిపించడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి. ఇప్పుడు మళ్ళీ సామ్ తన ఇన్ స్టాలో రాజ్ ఫొటో షేర్ చేయడం మరోసారి చర్చకు దారితీసింది. 

latest-news | telugu-news | cinema-news | Subham movie

Advertisment
Advertisment
తాజా కథనాలు