Nepal: నేపాల్ మంత్రిని పరిగెత్తించి కొట్టిన జనాలు.. వీడియో వైరల్!

నేపాల్ ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించి ఎత్తివేసింది. అయితే నిషేధం విధించడంతో యువత ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్‌ను ఖాట్మండు వీధుల గుండా వెంబడించారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
Nepal

Nepal

ప్రస్తుతం నేపాల్‌(nepal) లో పరిస్థితులు తీవ్రమయ్యాయి. ఇటీవల ప్రభుత్వం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌(Social Media Platforms) లపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ క్రమంలో జెన్ Z యువత నేపాల్ దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే నేపాల్ యువత ప్రధాని కెపి శర్మ ఓలీ ఇంటికి నిప్పు అంటించారు. ఆ తర్వాత ఆయన ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్‌ను ఖాట్మండు వీధుల గుండా వెంబడించారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చూడండి: Nepal: నేపాల్‌లో మంత్రుల ఇళ్లకు నిప్పు.. దుబాయ్‌కి పారిపోతున్న ప్రధాని ?

సోషల్ మీడియా యాప్స్‌ను బ్యాన్..

ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధాన్ని(Social Media Ban) ఎత్తివేయాలని, అవినీతిని అరికట్టాలనే డిమాండ్లతో ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ యాప్‌లు నిషేధాన్ని నేపాల్ ప్రభుత్వం ఎత్తివేసింది. అయినా కూడా ఈ నిరసనలు మళ్లీ చెలరేగాయి. అయితే ఖాట్మండు వీధుల్లో 65 ఏళ్ల మిస్టర్ పాడెల్ పరిగెడుతూ కనిపించాడు. ఇతనితో పాటు చాలా మంది ఉన్నారు. ఎదురుగా ఉన్న ఒక నిరసనకారుడు మంత్రిని తన్ని కింద పడేశాడు. అయినా కూడా అతను తప్పించుకుని పరిగెత్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గత సంవత్సరం తన కమ్యూనిస్ట్ పార్టీ మధ్య ఎడమ నేపాలీ కాంగ్రెస్‌తో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తన నాల్గవ పదవీకాలం ప్రారంభించిన ప్రధాన మంత్రి కె.పి. శర్మ ఓలి , యువ నిరసనకారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో నేపాల్ ప్రధాని నేడు రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తర్వాత మరో ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు. అయితే ప్రధాని కూడా దేశం నుంచి దుబాయ్ పారిపోయినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: PM KP Sharma Oli: నేపాల్ ప్రధాని రాజీనామా!

Advertisment
తాజా కథనాలు