Canada: ట్రంప్‌ ఆ మాటలన్నీ విలీన వ్యాఖ్యాల దృష్టి మరల్చేందుకే: ట్రూడో!

డొనాల్డ్ ట్రంప్‌ , కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మధ్య కొంతకాలంగా మాటల యుద్దం కొనసాగుతుంది.మా దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తానన్న ఆయన..వాటిని విధించే ముందు ప్రజల దృష్టిని మరల్చేందుకు విలీనం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

New Update
TRUMP TRUDO

Donald Trump - Justin Trudo

కెనడా 51 వ రాష్ట్రం పై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) , కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudo) మధ్య కొంతకాలంగా మాటల యుద్దం కొనసాతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ట్రూడో కీలక వ్యాఖ్యాలు చేస్తున్నారన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు.

Also Read: IIM Graduate Video Viral: పెళ్లి అంటే భయం వేస్తుంది.. ఐఐఎం స్టూడెంట్ ఆవేదన!

ట్రంప్‌ చాలా నైపుణ్యం కలిగిన సంధానకర్త. అమెరికా ప్రజలు చమురు, సహజ వాయువు, విద్యుత్‌, స్టీలు,అల్యూమినియం,కలప, కాంక్రీట్‌ వంటివన్నీ కెనడా నుంచే కొనుగోలు చేస్తున్నారు. మా దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తానన్న ఆయన..వాటిని విధించే ముందు ప్రజల దృష్టిని మరల్చేందుకు విలీనం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

టారిఫ్‌ లు విధిస్తే వాటి ధరలు ఆకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉందని ట్రూడో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అగ్రరాజ్యంలో కెనడా విలీనమయ్యే అవకాశమే లేదని కెనడా ప్రధాని మరోసారి తెలిపారు. ఇటీవల కెనడా, మెక్సికోల పై 25 శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. 

Also Read: CM Chandrababu: ఇలా ఎవడైనా చేస్తాడా?: అధికారులపై చంద్రబాబు ఫుల్ సీరియస్!

సుంకాలు పెంచుతానని...

అనంతరం కెనడా (Canada) ప్రధాని ట్రూడో..ట్రంప్‌ తో భేటీ అయ్యారు. వలసలు, డ్రగ్స్‌ అక్రమ రవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని, లేనిపక్షంలో సుంకాలు పెంచుతానని ట్రంప్‌ హెచ్చరించారు. అంతేకాక,ఇందులో విఫలమైతేఅమెరికా లో 51 వ రాష్ట్రంగా చేరాలని ట్రూడోకు చురకలంటించారు.

ఈ క్రమంలో గవర్నర్‌ ఆఫ్‌ కెనడా అంటూ ట్రూడో ను వ్యంగ్యంగా సంభోధించారు. మరోవైపు ట్రూడో తన ప్రధాని పదవితో పాటు లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తన వారసుడ్ని పార్టీ ఎంపిక చేసేవరకు ప్రధాని పదవిలో కొనసాగుతానని సృష్టీకరించారు. 

ఈ నేపథ్యంలోనే కెనడా 51 వ రాష్ట్రంగా చేరాలనే తన ప్రతిపాదనను ట్రంప్‌ మరోసారి లేవనెత్తారు. అయితే అందుకు అవకాశమే లేదని ట్రూడో ఇప్పటికే స్పష్టతనిచ్చారు. 

Also Read: Flipkart Republic Day deals 2025: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. వాటిపై 70 శాతం డిస్కౌంట్స్!

Also Read: Poco X7 5G series: ఒప్పో నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు