Poco X7 5G సిరీస్ గురువారం భారతదేశంలో ప్రారంభించబడింది. ఈ సిరీస్‌లో Poco X7 5G, Poco X7 Pro 5G మోడళ్లు ఉన్నాయి. దీని బేస్ మోడల్ MediaTek Dimensity 7300 Ultra చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. అలాగే 45W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరోవైపు, Poco X7 Pro వేరియంట్ MediaTek Dimensity 8400 Ultra SoCతో వస్తుంది. ఇది 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ రెండు మోడళ్లు 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాలు, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌లను కలిగి ఉన్నాయి. ఇది కూడా చూడండి: తొక్కిసలాటకు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు! Poco X7 5G Price భారతదేశంలో Poco X7 5G రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. అలాగే 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999గా నిర్ణయించబడింది. ఈ ఫోన్ కాస్మిక్ సిల్వర్, గ్లేసియర్ గ్రీన్, పోకో ఎల్లో షేడ్స్‌లో వస్తుంది. Poco X7 Pro 5G Price Poco X7 Pro 5G స్మార్ట్‌ఫోన్ కూడా రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 8GB + 256GB స్టో్రేజ్ వేరియంట్ ధర రూ. 26,999గా ఉంది. అలాగే 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 28,999 గా కంపెనీ నిర్ణయించింది. ఇది నెబ్యులా గ్రీన్, అబ్సిడియన్ బ్లాక్, పోకో ఎల్లో కలర్‌లలో వచ్చింది. ఇది కూడా చూడండి: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన కరుణాకర్‌రెడ్డి Poco X7 5G సిరీస్‌లోని ప్రో, వనిల్లా మోడల్‌లు వరుసగా ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 17 నుండి ఫ్లిప్‌కార్ట్ కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. అయితే ఫస్ట్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. ICICI బ్యాంక్ కస్టమర్లు రూ. 2,000 బ్యాంక్ ఆఫర్‌ను పొందవచ్చు. అలాగే Poco X7 Pro 5G కొనుగోలుదారులు ఫస్ట్ సేల్‌లలో అదనంగా రూ. 1,000 తగ్గింపు కూపన్‌ను పొందవచ్చు. Poco X7 5G series specifications Poco X7 5G ఫోన్ 6.67-అంగుళాల 1.5K కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అదే సమయంలో Poco X7 Pro 5G ఫోన్ 3,200nits పీక్ బ్రైట్‌నెస్ లెవల్, 6.73-అంగుళాల 1.5K ఫ్లాట్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. బేస్ మోడల్ Poco X7 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్‌సెట్‌తో శక్తిని పొందుతుంది. అదే ప్రో వేరియంట్ అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా SoCని కలిగి ఉంది. ఇది కూడా చూడండి: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్ Poco X7 5G series Camera ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు మూడు సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లు, నాలుగు సంవత్సరాల సెక్యురిటీ అప్‌గ్రేడ్‌లను పొందనున్నాయి. ఇక కెమెరా విషయానికొస్తే.. Poco X7 5G ఫోన్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్‌ను కలిగి ఉంది. అయితే ప్రో మోడల్ 50 మెగాపిక్సెల్ సోనీ LYT-600 ప్రధాన సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్‌తో వచ్చాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాను కలిగి ఉన్నాయి. ఇవి AI బ్యాక్డ్ ఇమేజింగ్, ఫోటో ఎడిటింగ్, Poco AI నోట్స్ వంటి ఇతర పనితీరును పెంచే ఫచర్లు అమర్చబడి ఉన్నాయి. ఇది కూడా చూడండి: బాలయ్యకు బిగ్ షాక్.. డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ క్యాన్సిల్! Poco X7 Pro 5G 90W హైపర్‌ఛార్జ్ సపోర్ట్‌తో 6,550mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది 47 నిమిషాల్లో ఫోన్‌ను సున్నా నుండి 100 శాతం ఛార్జ్ చేస్తుందని పేర్కొంది. మరోవైపు, Poco X7 5G 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,500mAh సెల్‌ను కలిగి ఉంది.