ఈ మధ్య కాలంలో పురుషుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయి. అందులో పెళ్లైన పురుషులే ఎక్కువ మంది ఉన్నారు. భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పురుషులపై గృహ హింస కేసులు పెడతామని కొందరు భార్యలు వేధిస్తుండటమే దీనికి ముఖ్య కారణం. ఇటీవలే బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య వేధింపులు భరించలేక తాను చనిపోతున్నట్లు ఓ వీడియో విడుదల చేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
బాధాకరమైన అనుభవం
ఇది కూడా చూడండి: తొక్కిసలాటకు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
తాజాగా అలాంటి వ్యవహారమే ఇప్పుడు మరొకటి వెలుగులోకి వచ్చింది. ఐఐఎం అహ్మదాబాద్ గ్రాడ్యుయేట్ అయిన ప్రత్యూష చల్లా ఇటీవల తన కుటుంబం ఎదుర్కొన్న బాధాకరమైన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. ఆ వీడియో ప్రకారం.. తన సోదరుడు హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు.
10 రోజులు మాత్రమే
తన సోదరుడికి పెళ్లి సంబంధాల కోసం చూస్తుండగా.. వివాహ వెబ్‌సైట్లో రాజమండ్రికి చెందిన ఒక మహిళ దొరికిందని అన్నారు. దీంతో 2019లో ఆ మహిళతో తన సోదరుడికి వివాహం జరిగిందని పేర్కొన్నారు. అయితే ఆ జంట ఎంతో కాలం కలిసి జీవించలేదని.. కేవలం 10 రోజులు మాత్రమే ఉన్నారని చెప్పుకొచ్చారు. పెళ్లైన తర్వాత తన వదిన.. తన తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించిందని చెప్పారు.
ఇది కూడా చూడండి: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన కరుణాకర్‌రెడ్డి
బెడ్‌రూమ్‌లోకి రానివ్వలేదు
అంతేకాకుండా అసభ్యకరమైన పదజాలంతో ఆమె మాట్లాడిందని.. తన సోదరుడిని సైతం ఆమె తన బెడ్‌రూమ్‌లోకి రానివ్వలేదని తెలిపారు. అక్కడితో ఆగకుండా ఆమె తరచుగా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని అన్నారు. దీనిబట్టి తన వదినకు ఈ వివాహం ఇష్టం లేదని తమకు అర్థమైనట్లు ఆరోపించారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందని అభిప్రాయపడ్డారు. ఇది స్పష్టంగా తన వదిన, ఆమె సోదరి, ఆమె సోదరుడు, ఆమె ప్రియుడు కలిసి చేసిన దోపిడీ ప్రణాళికగా చెప్పుకొచ్చారు.
చిన్న వీడియో:
— తెలుగు ప్రవచనాలు (@Pravachanaalu) January 5, 2025
పెళ్లి అంటే భయం వేస్తుంది !
False cases పెట్టిన వారు మీద strict action ఉండాలి!
Full video https://t.co/oEJrHdvP44 pic.twitter.com/h2pYp7XLX7
10 రోజుల తర్వాత ఫిర్యాదు
ఇది కూడా చూడండి: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్
తన వదిన హైదరాబాద్‌లోని తమ ఇంటిని విడిచిపెట్టిన పది రోజుల తర్వాత తమ కుటుంబంపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిందన్నారు. తమ కుటుంబ సభ్యులు క్రూరంగా ప్రవర్తించారని.. ఆమెను చిత్రహింసలు పెట్టాడని ఆరోపిస్తూ తమ కుటుంబంపై 498 కేసు (భారత శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 498A) దాఖలు చేసిందని ప్రత్యూష పేర్కొన్నారు.
విచారణ ప్రారంభం కాలేదు
దీంతో తమకు తెలియకుండానే ఎలాంటి దర్యాప్తు లేకుండానే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయబడిందని ప్రత్యూష ఆరోపించారు. ఇప్పటికి ఐదు సంవత్సరాలు అయినా విచారణ ఇంకా ప్రారంభం కాలేదని, తన కుటుంబం చాలా కాలంగా ఇబ్బందుల్లో ఉందని ప్రత్యూష చల్లా ఆ వీడియోలో వెల్లడించారు. ఇది చాలా బాధాకరమని.. తన తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా క్షీణించిందని పేర్కొన్నారు.
ఇది కూడా చూడండి: బాలయ్యకు బిగ్ షాక్.. డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ క్యాన్సిల్!
నాకు ఉద్యోగాలు దొరకడం లేదు
ఈ కేసుల వల్ల తమ కుటుంబం ఎంతో మనోవేదనకు గురవుతుందని.. శారీరక ఒత్తిడిని అనుభవిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల తన కెరీర్ కూడా నాశనమవుతున్నట్లు చెప్పుకొచ్చారు. తాను ఐఐఎం అహ్మదాబాద్, ఐఐటి గాంధీనగర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుండి అర్హతలు సాధించానని.. గోల్డ్‌మన్ సాచ్స్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా గతంలో పనిచేశానని తెలిపారు. అయినప్పటికీ పెండింగ్‌లో ఉన్న ఈ కేసు వల్ల తన ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసిందని ప్రత్యూష్ పేర్కొన్నారు. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. పెళ్లి చేసుకోవడం మానసిక ఆరోగ్యానికి హానికరం అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.