Flipkart Republic Day deals 2025: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. వాటిపై 70 శాతం డిస్కౌంట్స్!

ఫ్లిప్‌కార్ట్ తాజాగా మాన్యుమెంటల్ రిపబ్లిక్ డే 2025 సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ జనవరి 14 నుంచి ప్రారంభం కానుంది. ప్రైమ్ సభ్యులకు ఒక రోజు ముందు అంటే 13న ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో ఫోన్లు, ఛార్జర్లు, లాప్‌టాప్‌లు ఇతర గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.

New Update
Flipkart Republic Day deals 2025

Flipkart Republic Day deals 2025

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ తాజాగా కొత్త సేల్‌ను తీసుకొచ్చింది. ఎట్టకేలకు తన ‘‘మాన్యుమెంటల్ రిపబ్లిక్ డే సేల్ 2025’’ను ఆవిష్కరించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్, అలాగే ఎలక్ట్రానిక్ కాని వస్తువులపై బెస్ట్ డీల్‌లను పొందవచ్చు.

ఇది కూడా చూడండి: తొక్కిసలాటకు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

Flipkart Monumental Republic Day Sale 2025

ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్ 2025 జనవరి 14న ప్రారంభమవుతుంది. అదే ప్రైమ్ సభ్యులకు ఒకరోజు ముందు అంటే జనవరి 13న అందుబాటులోకి రానుంది. ఈ సేల్ ప్రారంభమయ్యే ముందు కొన్ని ప్రొడెక్టులను ‘విష్ లిస్ట్’ చేసుకోవచ్చు. ఇక ఈ సేల్ రష్ అవర్స్ ఉదయం 12 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది.

రూ.99 నుండి ప్రారంభం

కొనుగోలుదారులు సాయంత్రం 6 గంటలకు అతి తక్కువ ధరలోనే కొన్ని ప్రొడెక్టులను పొందుతారు. కేవలం రూ.76 ధరకే రోజువారీ డీల్స్ కొన్ని లభిస్తాయి. అలాగే టిక్-టాక్ డీల్స్ ప్రతి గంటకు కొత్త డీల్స్‌ను వెల్లడిస్తాయి. ఇక బ్రాండెడ్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లను రూ.45,990 నుండి కొనుక్కోవచ్చు. అలాగే ల్యాప్‌టాప్ యాక్ససరీలు రూ.99 నుండి ప్రారంభం అవుతాయి.

ఇది కూడా చూడండి: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్

అంతేకాకుండా కానన్ DSLR & మిర్రర్‌లెస్‌ను రూ.25,900 నుండి పొందవచ్చు. ఇవి మాత్రమే కాకుండా ఫ్లిప్‌కార్ట్ రూ.5039 నుండి ప్రారంభమయ్యే మానిటర్‌లపై అనేక డీల్స్‌ను అందిస్తోంది. ఇతర డీల్స్‌లో 4K & OLED టీవీలు, మిక్సర్ గ్రైండర్లు, రూమ్ హీటర్లు, వాటర్ ప్యూరిఫైయర్‌లు వరుసగా రూ.15999, రూ.999, రూ.799, రూ.6999 నుండి ప్రారంభం అవుతాయి.

ఇది కూడా చూడండి: బాలయ్యకు బిగ్ షాక్.. డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ క్యాన్సిల్!

మాన్యుమెంటల్ డీల్స్‌లో స్మార్ట్ గాడ్జెట్‌లపై అతిపెద్ద డిస్కౌంట్‌లను కూడా పొందొచ్చు. అలాగే టాప్ స్మార్ట్‌వాచ్‌లు రూ.899 నుండి ప్రారంభమవుతాయి. అలాగే ఫాస్ట్ పవర్‌బ్యాంక్‌లను కనీసం 50% తగ్గింపుతో పొందవచ్చు. ఛార్జర్‌లపై 70% వరకు తగ్గింపు పొందొచ్చు. మొబైల్ కవర్లు రూ.499 లోపు ఉండనున్నాయి. అంతేకాకుండా ఇతర గాడ్జెట్‌లపై కూడా మరిన్ని డిస్కౌంట్‌లు పొందొచ్చు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు