Canada: కారుపై మూత్ర విసర్జన..అడిగినందుకు భారత సంతతి వ్యక్తి హత్య..కెనడాలో దారుణం

కెనడాలో భారత సంతతి వ్యక్తి హత్యకు గురైయ్యాడు. తన కారుపై ఎందుకు మూత్ర విసర్జన చేస్తున్నావ్ అని అడిగినందుకే దుండగుడు అర్వి సింగ్ సాగూ అను వ్యక్తిని తల మీద బాది మరీ చంపేశాడు. 

New Update
Arvi

చిన్న చిన్న విషయాలకే హత్యలు(murder) చేయడం ఈ రోజుల్లో ఎక్కువ అయిపోయింది. అమెరికా, కెనడా(US-Canada) వంటి దేశాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడి స్థానికులు..తమను ఏ మాత్రం ప్రశ్నించినా ఊరుకోము అన్నట్టు తయారయ్యారు. తాజాగా కెనడాలో భారత సంతతికి చెందిన 55 అర్వి సింగ్ సాగూ ఇలాగే బలైపోయాడు. 

Also Read :  చేతులు కలిపిన అమెరికా, చైనా..టారిఫ్ ల నుంచి ఊరట

చేసిన తప్పు అడిగినందుకే...

అక్టోబర్ 19న అర్వి తన స్నేహితురాలితో కలిసి డిన్నర్ కు వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. వారిద్దరూ ఓ అపరిచిత వ్యక్తి తమ కారుపై మూత్ర విసర్జన చేస్తూ కనిపించాడు. దీంతో వారు అతని దగ్గరకు వెళ్ళి ఏం చేస్తున్నావు అని అడిగారు. దానికి అవతలి వ్యక్తి నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటూ సమాధానం చెప్పాడు. అక్కడితో ఆగకుండా సాకూ దగ్గరకు వెళ్ళి అతని తలపై కొట్టాడు. దీంతో అర్వి నేల మీద పడిపోయాడు. అతని స్నేహితురాలు వెంటనే 911 కు కాల్ చేసి ఆసుపత్రిలో జాయిన్ చేసినా సాగు ప్రాణాలు మాత్రం నిలవలేదు. లైఫ్ సపోర్ట్ లో ైదు రోజుల పాటూ పోరాటం చేసి అర్వి సింగ్ మరణించాడు. 

మరోవైపు సాగూపై దాడి చేసిన అతనిని కైల్ పాపిన్ అనే వ్యక్తిగా ఎడ్మంటన్ పోలీసులు గుర్తించారు. వెంటనే అతనిని అరెస్ట్ చేశారు.  తీవ్రమైన దాడికి పాల్పడ్డాడనే అభియోగంపై నిందితుడిపై కేసు నమోదు చేశారు. 

Also Read :  వాణిజ్య యుద్ధం ముగియనుందా..? ఆరేళ్ల తర్వాత ట్రంప్‌, జిన్‌పింగ్‌ భేటీ

Advertisment
తాజా కథనాలు